ఆకట్టుకునేలా సుశాంత్‌ సినిమా టీజర్‌..

‘చెయ్యి దాటిపోతుందిరా ఏదో ఒకటి చెయ్యాలిరా వెంటనే..’ అని అంటున్నారు యువ హీరో సుశాంత్‌. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’. ఎస్‌.దర్శన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. నిజ సంఘటనలను...

Updated : 29 Jan 2021 10:25 IST

ప్రభాస్‌ షేర్‌ చేసిన వీడియో చూశారా

హైదరాబాద్‌: ‘చెయ్యి దాటిపోతోందిరా ఏదో ఒకటి చెయ్యాలిరా వెంటనే..’ అని అంటున్నారు యువ హీరో సుశాంత్‌. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’. ఎస్‌.దర్శన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా చేసుకుని ప్రేమ, కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ సినిమా టీజర్‌ను తాజాగా ప్రభాస్‌ సోషల్‌మీడియా వేదికగా విడుదల చేశారు.

‘‘నా జీవితంలో అమ్మకి.. అమ్మాయికి.. బైక్‌కి ‘అభి’నాభావ సంబంధం ఉంది’’ అంటూ సుశాంత్‌ చెప్పే డైలాగ్‌తో ప్రారంభమైన ఈ సినిమా టీజర్‌ ఆకట్టుకునేలా సాగింది. ఆ తర్వాత వెంటనే ఎవరా ‘అభి’ అని వెన్నెల కిషోర్‌ అడగటం నవ్వులు పూయిస్తోంది.  తనకి ఇష్టమైన బైక్‌ వల్ల హీరో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? ప్రేమించిన అమ్మాయి మనసును ఎలా గెలుచుకున్నాడు?ఇలాంటి సన్నివేశాలను టీజర్‌లో చూడొచ్చు. కథానాయిక మీనాక్షి చౌదరి, సుశాంత్‌ల నటన మెప్పించేలా ఉంది. ప్రస్తుతం ఈ సినిమా టీజర్‌ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

ఇదీ చదవండి

4 కథలు.. 4 జంటలు.. ప్రేమ..


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని