Indian 2: ‘ఇండియన్‌ 2’ నుంచి అప్‌డేట్‌.. మరి ‘గేమ్‌ ఛేంజర్‌’ ఎప్పుడు!

రామ్‌ చరణ్‌-శంకర్‌ల కాంబోలో తెరకెక్కుతోన్న సినిమా ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer). దీని అప్‌డేట్స్‌ కోసం అభిమానులు పోస్టులు పెడుతున్నారు.

Published : 10 Oct 2023 12:20 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇండస్ట్రీలోని టాప్ డైరెక్టర్లలో శంకర్‌ ఒకరు. ఆయన ప్రస్తుతం కమల్ హాసన్‌తో ‘ఇండియన్‌ 2’ (Indian 2), రామ్‌చరణ్‌ (Ram Charan)తో ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer) తెరకెక్కిస్తున్నారు. వీటిలో ‘ఇండియన్‌ 2’కు పనులు చకాచకా జరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ కీలక అప్‌డేట్‌ను నిర్మాణ సంస్థ పంచుకుంది. దీంతో ‘గేమ్‌ ఛేంజర్‌’పై కూడా అప్‌డేట్‌ ఇవ్వాలంటూ రామ్ చరణ్‌ అభిమానులు సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ‘ఇండియన్‌-2’ తాజాగా డబ్బింగ్‌ పనులు కూడా షురూ చేసింది. ఈ విషయాన్ని తెలుపుతూ నిర్మాణ సంస్థ గ్లింప్స్‌ను విడుదల చేసింది. అందులో శంకర్‌, కమల్‌ హాసన్‌ ఇద్దరూ డబ్బింగ్‌ స్టూడియోలో కనిపించారు. దీంతో ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నట్లు అర్థమవుతోంది. యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో కాజల్‌ అగర్వాల్‌, సిద్ధార్థ్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, సముద్రఖని తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. 1996లో వచ్చిన సంచలన చిత్రం ‘ఇండియన్‌’ (భారతీయుడు)కు సీక్వెల్‌గా ఇది రూపొందుతోంది. 

‘లియో’ ట్రైలర్‌ ప్రదర్శన.. లీగల్ నోటీసులు పంపిన సెన్సార్‌ బోర్డు..

మరోవైపు రామ్‌ చరణ్‌ ‘గేమ్‌ ఛేంజర్‌’(RC15) గురించి ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి అప్‌డేట్‌ రాలేదు. తాజాగా దీని షూటింగ్ హైదరాబాద్‌లో మొదలైనట్లు సమాచారం. దాదాపు పది రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్‌లో చరణ్‌తో పాటు మిగిలిన ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో ఈ సినిమాపై కూడా ఏదో ఒక అప్‌డేట్‌ ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని