Indraja: కించపరచాలనే ఉద్దేశంతో ‘రజాకార్‌’ని తీయలేదు: ఇంద్రజ

‘రజాకార్‌’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ హైదరాబాద్‌లో జరిగింది. ఇందులో కీలక పాత్ర పోషించిన ఇంద్రజ వేడుకలో పాల్గొని మాట్లాడారు.

Published : 14 Mar 2024 00:20 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రజాకార్ల పీరియడ్‌లో ఏం జరిగిందనేదాన్ని మాత్రమే ‘రజాకార్‌’ (Razakar) సినిమాలో చూపించే ప్రయత్నం చేశామని, ఎవరినీ కించపరచాలనే ఉద్దేశంతో తీయలేదని సీనియర్‌ నటి ఇంద్రజ (Indraja) అన్నారు. ఆమె కీలక పాత్ర పోషించిన ఈ సినిమాని దర్శకుడు యాటా సత్యనారాయణ తెరకెక్కించారు. గూడూరు నారాయణ రెడ్డి నిర్మాత. బాబీ సింహా, వేదిక, అనుష్య త్రిపాఠి, ప్రేమ, మకరంద్‌ దేశ్‌పాండే తదితరులు నటించిన ఈ సినిమా మార్చి 15న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, మరాఠీ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా  చిత్ర బృందం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని బుధవారం నిర్వహించింది. నటుడు, దర్శకుడు ఆర్‌. నారాయణ మూర్తి, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొని, సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు.

ఇంద్రజ మాట్లాడుతూ.. ‘‘నారాయణ రెడ్డి ఎక్కడా రాజీ పడకుండా సినిమాని నిర్మించారు. సత్యనారాయణకు దర్శకత్వం కొత్తే అయినా అనుభవం ఉన్న వ్యక్తిగా అద్భుతంగా తెరకెక్కించారు’’ అని తెలిపారు. ఇది సాధారణ సినిమా కాదని నారాయణ మూర్తి పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని