Ruhani Sharma: సైకో పాత్రలు చేయాలనుంది... జుట్టు లేకున్నా అందమే
మేమిద్దరం వేరే ఒక ప్రాజెక్ట్ చేస్తున్న సమయంలో శ్రీనివాస్‌తో పరిచయం ఏర్పడింది. ఆరు నెలల తర్వాత ఫోన్ చేసి ‘నూటొక్క జిల్లాల అందగాడు’ కథను వినిపించారు. వినగానే నచ్చేసింది.
‘చి.ల.సౌ’ చిత్రంలో అంజలిగా తెలుగు తెరకు పరిచయమైన ఉత్తరాది భామ రుహాని శర్మ. అందులో తన నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. ఆ తర్వాత హిట్, డర్టీ హరి సినిమాల్లోనూ నటించింది. ఇప్పుడు అవసరాల శ్రీనివాస్ హీరోగా తెరకెక్కిన ‘నూటొక్క జిల్లాల అందగాడు’ హీరోయిన్గా చేసింది. సెప్టెంబర్ 3న ఆ చిత్రం ప్రేక్షకులు ముందుకొస్తుంది. ఈ సందర్భంగా రుహాని శర్మ మీడియాతో మాట్లాడారు. ఆ విషయాలు ఆమె మాటల్లోనే..
అందగాడి కథ అలా మొదలైంది
మేమిద్దరం వేరే ఒక ప్రాజెక్ట్ చేస్తున్న సమయంలో శ్రీనివాస్‌తో పరిచయం ఏర్పడింది. ఆరు నెలల తర్వాత ఫోన్ చేసి ‘నూటొక్క జిల్లాల అందగాడు’ కథను వినిపించారు. వినగానే నచ్చేసింది. హీరోహీరోయిన్ల పాత్రలను తీర్చిదిద్దిన తీరు ఆకట్టుకుంది. బట్టతలతో బాధపడే ఓ వ్యక్తి చుట్టూ తిరిగే కథ ఇది. తనను తాను అంగీకరించి ఎలా ముందుకు సాగాడనే కథాంశంతో తెరకెక్కింది. నా పాత్ర గురించి ఇప్పుడే చెప్పలేను. కానీ కథలో కీలకంగా మారే పాత్ర నాది. నిడివి కూడా ఎక్కువగానే ఉంటుంది.
రెండు సన్నివేశాలు చాలు
‘నూటొక్క జిల్లాల అందగాడు’ కథను రాసింది శ్రీనివాసే అయినా, డైరెక్టర్ విద్యాసాగర్ దాన్ని సొంతం చేసుకొని తెరకెక్కించారు. సినిమా ద్వారా డైరెక్టర్‌తో ఆయనకు మంచి అనుబంధం ఏర్పడింది. నా నుంచి, ఇతర నటీనటుల నుంచి ఎలాంటి నటనను రాబట్టుకోవాలో వారికి తెలుసు. వాళ్లిద్దరికీ కథపైన స్పష్టత ఉంది. శ్రీనివాస్ రచయితగా కథ గురించి దర్శకుడితో చర్చిస్తూ తగిన మార్పులు,చేర్పులు చేస్తుండేవాడు. నేను తెరపై ఎంతసేపు కనిపిస్తాననేది ఆలోచించను. స్క్రిప్ట్, నా పాత్ర బాగుండేలా చూసుకుంటాను. నటనకు ప్రాధాన్యముంటే రెండు సన్నివేశాలున్నా చాలనిపిస్తుంది. ‘చిలసౌ’ తర్వాత ‘హిట్’, ‘డర్టీ హరి’ సినిమాలు చేశాను. వాటిలో కూడా నా పాత్ర నిడివి తక్కువే ఉంటుంది. సినిమా స్ర్కిప్ట్ నా మొదటి ప్రాధాన్యత, ఆ తర్వాత నా పాత్ర బాగుందనిపిస్తే చేసేందుకు వెంటన ఒప్పుకుంటాను. రెండు పాటల కోసం హీరోయిన్గా చేయాలని ఉండదు.
సరదాగా సాగింది
‘చి.ల.సౌ’ తర్వాత ఒప్పుకున్న సినిమా ఇదే. కానీ కొన్ని కారణాల వల్ల విడుదల ఆలస్యమైంది. దీనికన్నా ముందు ‘హిట్’, ‘డర్టీ హరి’ వచ్చాయి. తమిళం, మలయాళం, హిందీలోనూ సినిమాలు చేశాను. మా సినిమా చిత్రీకరణంతా సరదాగా సాగిపోయింది. శ్రీనివాస్ ఇప్పుడు మంచి స్నేహితుడయ్యాడు. షూటింగ్ మొదలైన రెండు, మూడు రోజులు కొంత అసౌకర్యంగానే అనిపించింది. కానీ ఆ తర్వాత ఇద్దరం కలిసిపోయాం. నేరుగా వెళ్లి సలహాలు అడిగేంత చనువు ఏర్పడింది. సినిమాలు, ఇతర విషయాల గురించి మాట్లాడుకుంటాం. అవసరాల శ్రీనివాస్ దర్శకుడు,రచయితగా ఎంత మంచి ప్రతిభ ఉందో అందరికీ తెలిసిందే. ఆయన గత చిత్రాలు చూస్తే తెలిసిపోతుంది. అయితే దర్శకుడు, రచయిత కన్నా ముందు మంచి వ్యక్తిత్వమున్న నటుడాయన.
జుట్టు లేకున్నా అందమే
భర్తకు బట్టతల ఉందని నా స్నేహితులు కొందరు వాపోతుంటారు. ఆ మాటలు విన్నప్పడు షాక్‌కి గురవుతాను. బట్టతల అనేది చాలా సాధారణ సమస్య. అమ్మాయిలకు కూడా జుట్టు ఊడిపోతుంది. నా సన్నిహితులు కొందరు ఇదే సమస్యతో బాధపడుతుంటారు. జుట్టు లేకున్నా మీరు అందంగానే కనిపిస్తారని వారికి చెబుతుంటాను. చికిత్స చేయించుకునేందుకు సిద్ధమవుతుంటారు. బయటకు ఎలా కనిపించామనేది అందం కానే కాదు. ఇంత సున్నితమైన సమస్యను మా సినిమాలో భావోద్వేగంగా మలిచారు దర్శకరచయితలు. అయితే బాలీవుడ్లో వచ్చిన సినిమాలకు మాకు ఎలాంటి సంబంధం లేదనే చెబుతాను. ‘బాలా’, ‘ఉజ్డా చమ్మన్’ చూడలేదు. కానీ ఆ చిత్రాల్లాగే ‘నూటొక్క జిల్లాల అందగాడు’ కూడా బట్టతల చుట్టూ తిరిగే కథే. అయితే వాటితో పోల్చితే ఈ సినిమా కథ, దాన్ని తీర్చిదిద్దిన విధానం పూర్తిగా భిన్నంగా ఉంటాయి.
సైకో పాత్రలు చేయాలనుంది
తెలుగులో చేసింది నాలుగు సినిమాలే అయినప్పటికీ ప్రేక్షకుల నుంచి విశేషమైన ప్రేమాభిమానాలు దక్కాయి. ఇప్పటికీ ప్రేక్షకులు ‘చి.ల.సౌ’లోని అంజలి పాత్ర గురించి మాట్లాడుకుంటారు. నేను తెలుగులో చేసిన నాలుగు సినిమాలు పూర్తి భిన్నమైన సినిమాలే. కానీ నాకు వ్యక్తిగతంగా ప్రేమకథలు, సైకో పాత్రలు చేయాలని ఉంది. మరీ బోల్డ్‌గా నటించలేను. సౌకర్యంగా అనిపిస్తేనే చేస్తాను. హిందీ పరిశ్రమలో అవకాశాలు కష్టం. నటీనటుల ఎంపిక ప్రక్రియ పూర్తి విభిన్నంగా ఉంటుంది. రెండు,మూడు ఆడిషన్స్‌కి హాజరవ్వాల్సి ఉంటుంది. అయినా హిందీ పరిశ్రమలోనూ ప్రయత్నాలు చేస్తున్నాను. కానీ ప్రస్తుతం నా దృష్టంతా టాలీవుడ్‌పైనా ఉంది. ప్రస్తుతం నాని నిర్మిస్తున్న ‘మీట్ క్యూట్’లో చేస్తున్నాను. ఇది 5 కథల సమాహారం. ఇందులో సత్యరాజ్‌తో కలిసి నటిస్తున్నాను. దీంతో పాటు ఎరోస్ ఇంటర్నేషనల్ తెలుగులో చేస్తున్న ఆంథాలజీని ఓకే చేశాను. కథ బాగుంటే ఏ పరిశ్రమలో చేయడానికైనా నేను సిద్ధమే. తెలుగులో స్వయంగా డబ్బింగ్ చెప్పడానికి ప్రయత్నాలు చేస్తున్నాను.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాయికలూ.. రికార్డులు బద్దలు కొట్టగలరు!
బాలీవుడ్ సీనియర్ నాయిక కరీనాకపూర్ టాప్‌గేర్‌లో దూసుకెళ్తోంది. ఆమె నటించిన ‘క్రూ’ ఒకవైపు మంచి కలెక్షన్లు కురిపిస్తుంటే.. మరోవైపు ఆమె ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ యూనిసెఫ్‌కి భారత్ జాతీయ ప్రచారకర్తగా ఎంపికైంది. -
‘పుష్పక విమానం’ లాంటి మూకీ చిత్రం చేయాలనుంది!
‘‘ఆద్యంతం వినోదం పంచుతూనే మంచి సందేశమిచ్చే చిత్రం ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. పెళ్లి వెనకున్న ఓ సమస్యను.. దాని చుట్టూ జరుగుతున్న రూ.కోట్ల వ్యాపారాన్ని.. ఓ స్కామ్‌ను దీంట్లో వినోదాత్మకంగా చూపించాం. -
ఇండస్ట్రీలో ఆ హీరోయిన్స్ తక్కువ.. ఆ ఖాళీని భర్తీ చేయాలనుకుంటున్నా!
faria abdullah interview: అల్లరి నరేశ్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన కామెడీ ఎంటర్టైనర్ ‘ఆ ఒక్కటీ అడక్కు’ మూవీ విడుదల కానున్న నేపథ్యంలో ఫరియా పంచుకున్న విశేషాలు.. -
పరిశ్రమను వదిలి వెళ్లాలనుకున్నా!
‘మురారి’, ‘ఇంద్ర’, ‘మన్మథుడు’లాంటి హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్ నాయిక సోనాలీ బెంద్రే. చాలా ఏళ్ల విరామం తర్వాత ‘ది బ్రోకెన్ న్యూస్’ అనే సిరీస్‌తో తెరపై కనిపించింది. -
నా జీవితంలో ఇదే రిస్కీ సినిమా
‘క్రూ’.. ఇటీవలే విడుదలైన ఈ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది బాలీవుడ్ భామ కృతిసనన్. ఇందులో ఎయిర్‌హోస్టెస్ పాత్రలో కనిపించి సినీప్రియుల్ని మెప్పించింది. -
ఆ విషయంలో అల్లరి నరేశ్‌ను పట్టుబట్టా: నాని
నరేశ్ హీరోగా తెరకెక్కిన కామెడీ ఫిల్మ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్లో నాని సందడి చేశారు. -
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
చరణ్, జాన్వీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్ చేయాలన్నది నా కల: చిరంజీవి
‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రెండో భాగంలో రామ్‌చరణ్, జాన్వీకపూర్ కలిసి నటిస్తే చూడాలన్నది తన కల అని, దానికోసం ఎదురుచూస్తున్నానని అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) అన్నారు. -
హీరో ఒక్కడే థియేటర్లలోకి రప్పించలేడు
‘సినిమాలో పెద్ద హీరో ప్రధాన పాత్రధారిగా ఉన్నంతమాత్రాన ప్రేక్షకుడిని థియేటర్లలోకి రప్పించలేం. కథే సిసలైన హీరో’ అంటోంది కృతి సనన్. -
ఆ అవకాశం ఉంటే చెన్నై వదిలి ఇక్కడే సినిమాలు చేస్తా!
వైవిధ్యభరితమైన థ్రిల్లర్ కథలకు చిరునామాగా నిలుస్తుంటారు విజయ్ ఆంటోని. ఇప్పుడాయన తొలిసారి రొమాంటిక్ జానర్లో ‘లవ్ గురు’ అనే చిత్రం చేశారు. ఆయన స్వయంగా నిర్మించిన ఈ సినిమాని వినాయక్ వైద్యనాథన్ తెరకెక్కించారు. -
ఆ దిగ్గజ నటుడు నాకు ఆరాధ్య దైవంతో సమానం: మురళీ మోహన్
సినీ నటుడు మురళీ మోహన్ తాజాగా ‘ఆలీతో సరదాగా’లో పాల్గొన్నారు. ఆయన జీవితంలోని కొన్ని ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. -
ఆ మాటలతోనే స్టార్‌నయ్యా.. ఇప్పటికీ షాంపూ బాటిల్లో నీళ్లు పోసి వాడుతుంటా!: చిరంజీవి
కెరీర్ పరంగా తాను ఎదుర్కొన్న సవాళ్లు, తన కుటుంబం, పొదుపుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi). -
చిరంజీవితో ఆ పాటకు డ్యాన్స్ వేయడం కష్టంగా అనిపించింది: రాధ
నటి రాధ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె కెరీర్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
Prithviraj Sukumaran: అందుకు మలయాళ ఇండస్ట్రీ నాపై అసూయ పడిందేమో: పృథ్వీరాజ్ సుకుమారన్
తన కొత్త సినిమా ‘ఆడుజీవితం’ ప్రచారంలో భాగంగా హైదరాబాద్‌కు వచ్చారు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్. ఆ చిత్రం గురించి పలు విశేషాలు పంచుకున్నారు. -
alitho saradaga: డబ్బులు అడుగుతానేమోనని కొందరు తప్పించుకు తిరిగేవాళ్లు: పుల్లెల గోపీచంద్
ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. చాముండేశ్వర నాథ్‌తో కలిసి ఆయన చెప్పిన సంగతులేంటంటే.. -
Anupama Parameswaran: అందుకు బోర్ ఫీలయ్యా.. గ్లామర్ డోస్‌పై స్పందించిన అనుపమ
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో హైదరాబాద్‌లో జరిగింది. -
Priyadarshi: స్వచ్ఛమైన హాస్యంతో సినిమా ఓ పెద్ద సవాల్
‘‘కథానాయకుడు అనగానే ఒక ప్రత్యేకమైన ఇమేజ్‌కి పరిమితం చేసినట్టు ఉంటుంది. స్వేచ్ఛగా ఉండలేను. నన్ను నేను ఓ నటుడిగా చూసుకోవడానికే ఇష్టపడతా’’ అన్నారు ప్రియదర్శి. -
Sivaji: ఆలీ అన్నా.. దయచేసి ఎన్నికల్లో పోటీ చేయొద్దు: శివాజీ
ఇప్పటి రోజుల్లో రాజకీయాలు వ్యాపారంగా మారాయన్నారు నటుడు శివాజీ. డబ్బులు ఖర్చుపెట్టడంతోపాటు వివిధ మార్గాల్లో ఆ మొత్తాన్ని తిరిగి లాక్కొనేవారికే పాలిటిక్స్ సెట్ అవుతాయన్నారు. -
Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్.. ఆ ఉద్దేశంతో పెట్టలేదు : అల్లరి నరేశ్
నరేశ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో నరేశ్ పాల్గొని సందడి చేశారు. -
Raghu Karumanchi: స్టాక్‌మార్కెట్.. రూ.కోట్లలో నష్టపోయా: రఘు
ఈటీవీలో ప్రసారమవుతోన్న సెలబ్రిటీ టాక్ షో ‘చెప్పాలని ఉంది’ (Cheppalani Vundi). బాలాదిత్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ కార్యక్రమంలో తాజాగా టాలీవుడ్ హాస్యనటుడు రఘు కారుమంచి (Raghu Karumanchi) పాల్గొన్నారు. తన కెరీర్ విశేషాలు పంచుకున్నారు. -
Akash Puri: అప్పటి వరకు నాన్న దర్శకత్వంలో నటించను: ఆకాశ్ పూరి
తన తండ్రి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రస్తుతానికి నటించాలనుకోవడంలేదని నటుడు ఆకాశ్ తెలిపారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు.