RRR: ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌లను పిండేసిన రాజమౌళి.. ఒక్కో సీన్‌ తీశారిలా..!

ఎన్టీఆర్‌(NTR), రామ్‌చరణ్‌(Ram charan) కథానాయకులుగా ఎస్.ఎస్‌. రాజమౌళి(Rajamouli) దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్‌బస్టర్‌ చిత్రం ‘RRR’.

Published : 23 May 2022 14:21 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఎన్టీఆర్‌(NTR), రామ్‌చరణ్‌(Ram charan) కథానాయకులుగా ఎస్.ఎస్‌. రాజమౌళి(Rajamouli) దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్‌బస్టర్‌ చిత్రం ‘RRR’. ఇండియన్‌ బాక్సాఫీస్‌ వద్ద రూ.1200 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టిన ఈ చిత్రం ఇప్పుడు జీ5 ఓటీటీ వేదికగా సందడి చేస్తోంది. ఈ సినిమా విడుదల సందర్భంగా ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, రాజమౌళి కలిసి ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇచ్చిన సంగతి తెలిసిందే. అదే విధంగా సినిమా షూటింగ్‌ సందర్భంగా జరిగిన సంఘటనలను కూడా చర్చించుకున్నారు. అప్పుడు వారు మాట్లాడుకున్న విషయాలు సినిమా చూస్తే కానీ, చాలా మందికి అర్థం కాలేదు. హీరోలిద్దరితోనూ జక్కన్న ఏ సీన్‌ ఎలా తీశారన్న విషయాలను చెబుతూ ఎడిట్‌ చేసిన ఓ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్‌ అవుతోంది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఇంటర్వెల్‌కి ముందు జంతువులతో కలిసి ఎన్టీఆర్‌ వ్యాన్‌లో నుంచి దూకే సీన్‌, రామ్‌చరణ్‌తో కలిసి ఫైట్‌ చేసే సీన్‌ ఇలా ఒక్కోదాన్ని ఎలా చేశారో ఇందులో చూపించారు. ఎన్టీఆర్‌ కామెంట్రీకి తోడు ఆ సన్నివేశాలు కనిపిస్తుంటే మరింత సరదాగా ఉందా వీడియో. ఇంకెందుకు ఆలస్యం నవ్వులు పంచుతున్న ఆ వీడియోను మీరూ చూసేయండి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని