John Abraham: నేను హిందీ హీరోని.. తెలుగు సినిమాలు చేయను: జాన్‌ అబ్రహం

‘జిస్మ్‌‌’తో వెండితెరకు పరిచయమైన బాలీవుడ్‌ నటుడు జాన్‌ అబ్రహం. ‘ధూమ్‌’, ‘రేస్‌’ ‘సత్యమేవజయతే’, ‘సత్యమేవజయతే-2’.. వంటి విభిన్న చిత్రాలతో తరచూ ప్రేక్షకుల్ని మెప్పించే ఈ యాక్షన్‌ హీరో నటించిన సరికొత్త సినిమా ‘ఎటాక్‌’. రెండు భాగాలుగా ఈ సినిమా విడుదల ....

Published : 31 Mar 2022 13:58 IST

ముంబయి: ‘జిస్మ్‌‌’తో వెండితెరకు పరిచయమైన బాలీవుడ్‌ నటుడు జాన్‌ అబ్రహం. ‘ధూమ్‌’, ‘రేస్‌’ ‘సత్యమేవజయతే’, ‘సత్యమేవజయతే-2’.. వంటి విభిన్న చిత్రాలతో తరచూ ప్రేక్షకుల్ని మెప్పించే ఈ యాక్షన్‌ హీరో నటించిన సరికొత్త సినిమా ‘ఎటాక్‌’. రెండు భాగాలుగా ఈ సినిమా విడుదల కానుంది. మొదటి భాగాన్ని ‘ఎటాక్‌ పార్ట్‌1’గా ఏప్రిల్‌ 1న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలో ‘ఎటాక్‌’ బృందంతో కలిసి జాన్‌ అబ్రహం ఓ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ సమయంలో ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు జాన్‌ స్పందించిన తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అసలేం జరిగిందంటే..

ప్రభాస్‌ హీరోగా సిద్ధమవుతోన్న ‘సలార్‌’లో జాన్‌ అబ్రహం కీలకపాత్ర పోషించనున్నారంటూ గత కొన్నిరోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. దీనిపై చిత్రబృందం నుంచి ఎటువంటి స్పందన లేదు. ఈ క్రమంలోనే తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో ‘‘సలార్‌’లో మీ సపోర్టింగ్‌ రోల్‌ చేయనున్నారంట కదా నిజమేనా?’’ అని విలేకరి ప్రశ్నించగా జాన్‌ స్పందించారు. ‘‘ఇతర నటీనటుల మాదిరిగా తెలుగు లేదా ఏదో ఒక  ప్రాంతీయ భాషా చిత్రంలో నేనెప్పటికీ నటించను. నేనొక హిందీ సినిమా హీరోని. నటుడ్ని కాబట్టి ఏదో ఒక సినిమాలో స్క్రీన్‌పై కనిపించాలనే ఉద్దేశంతో సెకండ్‌ హీరోగా చేయను’’ అని జాన్‌ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం జాన్‌ వ్యాఖ్యలు అంతటా చర్చనీయాంశంగా మారాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని