Jyothika: మంచి కథలో భాగం కావాలనుకుంటా: జ్యోతిక

‘సైతాన్‌’ చిత్రంతో బాలీవుడ్‌ రీఎంట్రీ ఇచ్చిన కథానాయిక జ్యోతిక ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.

Published : 03 Mar 2024 13:49 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కథానాయిక ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నటి జ్యోతిక (Jyothika). ఆమె సినిమాలంటే ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. తాజాగా బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్‌ (Ajay Devgn) ‘సైతాన్‌’ (Shaitaan) మూవీతో బాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఆర్‌.మాధవన్‌ (R Madhavan) కీలక పాత్రలో నటించారు. హారర్‌ థ్రిల్లర్‌గా వికాస్‌ భల్‌ ఈ చిత్రాన్ని తెకెక్కించారు. ఆసక్తికర సన్నివేశాలతో ఇలీవల విడుదలైన ట్రైలర్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ సినిమా మార్చి 8న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడారు.

‘‘బాలీవుడ్‌లో సినిమాలు చేసి 25 సంవత్సరాలు గడిచాయి. ఈ సినిమాతో రీఎంట్రీ ఇస్తున్నా. ఇందులో బలమైన పాత్రలో నటించాను. ఆ పాత్రకు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు వస్తుందనే నమ్మకం ఉంది. ఎందుకంటే మంచి కథలో భాగం కావాలనుకుంటా. సాధారణంగా నా పాత్రకు ప్రాధాన్యత ఇచ్చే సన్నివేశాలు ఉంటే అటువంటి సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపిస్తాను. నేను దక్షిణాదిలో అన్ని రకాల పాత్రల్లో నటించాను. ఆ చిత్రాల్లో  అర్థవంతమైన కథ, కథనం ఉంటాయి. మరోవైపు ఆర్‌ మాధవన్‌తో రెండు దశాబ్దాల తర్వాత కలిసి నటిస్తున్న చిత్రం ఇది.  పరిశ్రమలో అప్పటికి ఇప్పటికీ నటన పరంగా ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నాం. ఈ సినిమాలో నెగిటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో అద్భుతంగా నటించారు’’ అని జ్యోతిక వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని