Kareena Kapoor: యశ్‌ సినిమాలో కరీనా కపూర్‌.. స్పందించిన టీమ్‌

యశ్‌ (Yash) నటిస్తోన్న ‘టాక్సిక్‌’ (Toxic)లో బాలీవుడ్‌ నటి కరీనాకపూర్‌ (kareena Kapoor) కీలకపాత్ర పోషిస్తున్నారంటూ ఇటీవల ప్రచారం జరిగింది. దీనిపై నటి టీమ్‌ స్పందించింది.

Published : 11 Jan 2024 16:34 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘కేజీయఫ్‌’ (KGF) చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా ఫేమ్‌ సొంతం చేసుకున్నారు నటుడు యశ్‌ (Yash). ఆయన హీరోగా నటిస్తోన్న కొత్త చిత్రం ‘టాక్సిక్‌’ (Toxic). బాలీవుడ్‌ నటి కరీనాకపూర్‌ (Kareena kapoor) ఇందులో నటించనున్నారంటూ ఇటీవల ప్రచారం జరిగింది. కీలకపాత్రలో ఆమె కనిపించనున్నారని టాక్‌. దీనిపై నటి టీమ్‌ స్పందించింది. త్వరలోనే ఆసక్తికర విషయాన్ని బయటపెడతామని చెప్పింది. అప్పటివరకూ వేచి ఉండమని కోరింది. ‘‘కరీనా కపూర్‌ తదుపరి ప్రాజెక్ట్‌ గురించి పలు కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. మీ ఆసక్తిని మేము అర్థం చేసుకోగలం. అధికారిక సమాచారం లేకుండా ఇలాంటి కథనాలు ప్రచురించవద్దని కోరుతున్నాం’’ అని తెలిపింది.

యశ్‌ నటిస్తోన్న 19వ చిత్రం ‘టాక్సిక్‌’. మలయాళీ నటి, దర్శకురాలు గీతూమోహన్‌ దాస్‌ దీనిని తెరకెక్కిస్తున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్‌తో కె.వి.ఎన్‌ ప్రొడక్షన్స్‌, మాన్‌స్టర్‌ మైండ్‌ క్రియేషన్స్‌ సంస్థలు నిర్మిస్తున్నాయి. యాక్షన్‌ ప్రియులను అలరించే కథాంశంతో ఇది సిద్ధమవుతోన్నట్లు సమాచారం. సాయిపల్లవి, శ్రుతిహాసన్‌ కథానాయికలుగా కనిపించనున్నారని టాక్‌. వేసవి కానుకగా వచ్చే ఏడాది ఏప్రిల్‌ 10న ఇది విడుదల కానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని