Kranti: ఓటీటీలో దర్శన్‌ ‘క్రాంతి’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

Kranti on OTT: కన్నడ నటుడు దర్శన్‌ కథానాయకుడిగా నటించిన ‘క్రాంతి’ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయ్యేందుకు సిద్ధమైంది.

Published : 21 Feb 2023 19:49 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఒక భాషలో విజయవంతమైన చిత్రాలను ఇతర భాషల్లోకి డబ్‌ చేసి ఓటీటీ సంస్థలు అందుబాటులోకి తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ జాబితాలో కన్నడ చిత్రం ‘క్రాంతి’ (Kranti on OTT) చేరింది. దర్శన్ కథానాయకుడిగా వి.హరికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. రచితరామ్‌ కథానాయిక. జనవరి 26న కేవలం కన్నడలో విడుదలైన ఈ యాక్షన్‌ డ్రామా మిశ్రమ స్పందనలు అందుకుంది. ఇప్పుడు ఓటీటీలో వేదికగా సందడి చేసేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ అమెజాన్‌ ప్రైమ్‌వీడియో వేదికగా ఫిబ్రవరి 23వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. కన్నడతో పాటు, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఈ సినిమాను అందుబాటులో ఉండనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని