Nithiin: ఇది శాంపిల్‌ మాత్రమే.. అసలైన వేట ముందుంది: నితిన్‌

కెరీర్‌ ప్రారంభించిన నాటి నుంచి యూత్‌ఫుల్‌, కుటుంబకథా చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరించిన నితిన్‌ మొదటిసారి సీరియస్‌ కథతో మెప్పించేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన కథానాయకుడిగా నటిస్తోన్న చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం...

Published : 30 Mar 2022 15:27 IST

హైదరాబాద్‌: ఇప్పటి వరకూ యూత్‌ఫుల్‌, కుటుంబ కథా చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరించిన నితిన్‌..  తొలిసారి సీరియస్‌ కథతో మెప్పించేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన కథానాయకుడిగా నటిస్తోన్న చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’. రాజశేఖర్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. బుధవారం నితిన్‌ పుట్టినరోజుని పురస్కరించుకుని ఈ చిత్ర బృందం ఓ స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. సినిమాలో నితిన్‌ పోషిస్తోన్న సిద్దార్థ్‌ రెడ్డి రోల్‌ని తెలియజేసేలా ఓ వీడియోని షేర్‌ చేసింది.

ఈ వీడియోని ట్వీటర్‌ వేదికగా షేర్‌ చేసిన నితిన్‌.. ‘‘ఇది కేవలం శాంపిల్‌ మాత్రమే. జులై 8 నుంచి అసలైన వేటని థియేటర్లలో చూడండి’’ అని పేర్కొన్నారు. పొలిటికల్‌, ఫ్యాక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌లో సిద్ధమవుతోన్న ఈ సినిమాలో హీరోయిన్‌గా కృతి శెట్టి సందడి చేయనున్నారు. శ్రేష్ఠ మూవీస్‌ పతాకంపై ఈ సినిమా సిద్ధమవుతోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని