Mahesh Bhatt: ఏ డాక్టర్‌ దగ్గరకు వెళ్లకుండానే ఆ వ్యసనం నుంచి బయటపడ్డా : మహేశ్‌ భట్‌

ప్రముఖ చిత్ర నిర్మాత మహేశ్‌ భట్‌ తన జీవితంలో వచ్చిన మార్పులను గుర్తుచేసుకుంటూ ఓ ఇంటర్య్వూలో మాట్లాడారు. 

Published : 08 Feb 2024 15:15 IST

ముంబయి: బాలీవుడ్‌లో నిర్మాతగా, దర్శకుడిగా అభిమానులను సొంతం చేసుకున్నారు మహేశ్‌ భట్‌(Mahesh Bhatt). ఇటీవల ఓ ఇంటర్య్వూలో ఆయన మాట్లాడుతూ  కుమార్తె షాహీన్‌ భట్‌ కోసం తన అలవాట్లను ఎలా మార్చుకున్నారో చెప్పారు. ‘‘మద్యం మానేయడం ఓ యుద్ధం. నేను అందులో గెలిచాను. నేను మద్యం మానేశానంటే ప్రజలు ఆశ్చర్యపోతారు. కానీ అది నిజం. అందుకు కారణం నా కుమార్తె షాహీన్‌ భట్‌. షాహీన్‌ను నా చేతుల్లోకి తీసుకున్నప్పుడు తను నా నుంచి దూరం జరుగుతూ ఉండేది. అది నాకు నచ్చలేదు. ఆ చిన్నారి జీవితం నాకు ఏదో చెబుతోందని భావించి తాగడం మానేశాను. అప్పుడే నాలో ఓ తండ్రి పుట్టాడు. ఏ డాక్టర్‌ దగ్గరికీ వెళ్లకుండానే నేను ఆ వ్యసనం నుంచి బయటపడ్డాను. నన్ను మార్చింది నా కుమార్తే’’అని మహేశ్‌ భట్‌ పేర్కొన్నారు. 

మహేశ్‌ భట్‌ ఎదుర్కొన్న ఆటుపోట్లను గురించి గతంలో ఆయన రెండో కుమార్తె అలియా భట్‌ (Alia Bhatt) మాట్లాడారు. ‘‘మా నాన్న తెరకెక్కించిన చిత్రాలు వరుసగా ఫ్లాప్‌ అయ్యాయి. దాంతో ఆయన మద్యానికి బానిస అయ్యారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాం. కొంతకాలానికి ఆయన మద్యాన్ని వదిలేశారు. నా తల్లిదండ్రులిద్దరూ ఎంతో శ్రమించి తిరిగి ఈ స్థాయికి చేరుకున్నారు’’ అని తెలిపారు.  

‘డాడీ’, ‘ఆషికీ’, ‘కబ్జా’, ‘సడక్‌’, ‘క్రిమినల్‌’ వంటి చిత్రాలకు మహేశ్‌ భట్‌ దర్శకత్వం వహించారు. 1984లో ఆయన రూపొందించిన ‘సారాంశ్’ 14వ మాస్కో అంతర్జాతీయ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ప్రదర్శించారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని