Mangalvaaram: ఓటీటీలోకి ‘మంగళవారం’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే..?

‘మంగళవారం’ సినిమా ఓటీటీ రిలీజ్‌కు రంగం సిద్ధమైంది. మరో మూడు రోజుల్లో ఓ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ వేదికగా ఇది ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది.

Published : 23 Dec 2023 19:05 IST

హైదరాబాద్‌: నటి పాయల్‌ రాజ్‌పుత్ (Payal Rajput) ప్రధాన పాత్రలో నటించిన మిస్టరీ థ్రిల్లర్‌ ‘మంగళవారం’ (Mangalavaaram). ఈ చిత్రానికి ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వం వహించారు. ఎన్నో అంచనాల మధ్య గత నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మిశ్రమ స్పందనలు సొంతం చేసుకుంది. ఇప్పుడీ చిత్రం ఓటీటీ వేదికగా వినోదాన్ని అందించేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ డిస్నీ + హాట్‌స్టార్‌ వేదికగా ఈ నెల 26 నుంచి ‘మంగళవారం’ స్ట్రీమింగ్‌ కానుంది. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడలోనూ ఇది అందుబాటులో ఉండనుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ సదరు ఓటీటీ సంస్థ తాజాగా పోస్ట్‌ పెట్టింది.

గేమ్‌ ఛేంజర్‌ రిలీజ్‌.. దిల్‌ రాజు ఏమన్నారంటే

కథేంటంటే: మ‌హాల‌క్ష్మీపురంలో వ‌రుస‌గా రెండు జంట‌ల‌ ప్రాణాలు గాల్లో క‌లిసి పోతాయి. అదీ ఆ గ్రామ దేవ‌త మాల‌చ్చ‌మ్మ‌కి ఇష్ట‌మైన మంగ‌ళ‌వారం రోజున‌. అక్ర‌మ సంబంధాలు పెట్టుకున్నారంటూ ఎవ‌రో గుర్తు తెలియ‌ని వ్య‌క్తి ఊరి గోడల‌పై రాసిన రాత‌ల వ‌ల్లే వాళ్లు ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డి ఉంటార‌ని గ్రామ‌స్తులంతా న‌మ్ముతారు. కానీ, ఆ ఊరికి కొత్త‌గా వ‌చ్చిన ఎస్సై మాయ (నందిత శ్వేత‌) మాత్రం అవి ఆత్మ‌హ‌త్య‌లు కావు హ‌త్య‌ల‌ని బ‌లంగా న‌మ్ముతుంది. అది నిరూపించేందుకు ఆ శ‌వాల‌కు పోస్ట్‌మార్టం చేయించాల‌ని ప్ర‌య‌త్నిస్తే ఊరి జ‌మిందారు ప్ర‌కాశం బాబు (చైత‌న్య కృష్ణ‌) అడ్డు చెబుతాడు. అత‌ని మాట‌కు ఊరు కూడా వంత పాడ‌టంతో మొద‌టిసారి త‌న ప్ర‌య‌త్నాన్ని విర‌మించుకుంటుంది. కానీ, రెండో జంట చ‌నిపోయిన‌ప్పుడు మాత్రం ఊరి వాళ్ల‌ను ఎదిరించి మ‌రీ పోస్టుమార్టం చేయిస్తుంది. మ‌రోవైపు ఊరి వాళ్లు గోడ‌ల‌పై రాత‌లు రాస్తున్న అజ్ఞాత వ్య‌క్తి ఎవ‌రో క‌నిపెట్టేందుకు రంగంలోకి దిగుతారు. మ‌రి ఊర్లో జ‌రిగిన‌వి ఆత్మ‌హ‌త్య‌లా? హ‌త్య‌లా? ఈ చావుల వెన‌కున్న ల‌క్ష్యం ఏంటి?వీటికి ఆ ఊరి నుంచి వెలివేయ‌బ‌డ్డ శైల‌జ అలియాస్ శైలు (పాయ‌ల్ రాజ్‌పుత్‌)కు ఉన్న సంబంధం ఏంటి? అస‌లు ఆమె క‌థేంటి? ఊర్లో జ‌రిగే చావులకు  ఫొటోగ్రాఫ‌ర్ వాసు (శ్ర‌వ‌ణ్ రెడ్డి), డాక్ట‌ర్ (ర‌వీంద్ర విజ‌య్), జ‌మిందారుకు.. అత‌ని భార్య (దివ్యా పిళ్లై)కు ఏమైనా సంబంధం ఉందా? శైలు చిన్న‌నాటి ప్రియుడు ర‌వి క‌థేంటి? అన్న‌ ఆసక్తికర అంశాలతో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని