Game Changer: ‘గేమ్‌ ఛేంజర్‌’ రిలీజ్‌.. దిల్‌ రాజు ఏమన్నారంటే..?

‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer) రిలీజ్‌పై చిత్ర నిర్మాత దిల్‌రాజు (Dil Raju) స్పందించారు. తమ చిత్రాన్ని ఎప్పుడు రిలీజ్‌ చేయనున్నది చెప్పారు.

Published : 23 Dec 2023 17:29 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: రామ్‌చరణ్‌ (Ram Charan) హీరోగా ప్రముఖ దర్శకుడు శంకర్‌ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer). దిల్‌రాజు నిర్మాత. ఈ సినిమా విడుదల కోసం సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ‘గేమ్‌ ఛేంజర్‌’ రిలీజ్‌పై నిర్మాత స్పందించారు. వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో దీనిని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపారు. ‘సలార్‌’ వీక్షించడం కోసం థియేటర్‌కు వచ్చిన ఆయన్ని పలువురు అభిమానులు ‘గేమ్‌ ఛేంజర్‌’ రిలీజ్‌ ఎప్పుడు అని ప్రశ్నించగా.. ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. దీనిపై రామ్‌చరణ్‌ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎక్స్ వేదికగా పోస్టులు పెడుతున్నారు. RamCharan, GameChanger హ్యాష్‌ట్యాగ్స్‌ ట్విటర్‌లో ట్రెండ్‌ అవుతున్నాయి.

Salaar: అదరగొట్టిన ‘సలార్‌’.. మొదటి రోజు కలెక్షన్స్‌ ఎంతంటే!

రామ్‌చరణ్‌ నటిస్తోన్న 15వ చిత్రమిది. భారీ బడ్జెట్‌తో ఇది నిర్మితమవుతోంది. దర్శకుడు కార్తిక్‌ సుబ్బరాజ్‌ అందించిన పొలిటికల్‌, యాక్షన్‌ కథతో ‘గేమ్‌ ఛేంజర్‌’ తెరకెక్కుతోంది. ఇందులో రామ్ చరణ్ ద్విపాత్రాభినయంలో కనిపించనున్నట్లు సమాచారం. కియారా అడ్వాణీ హీరోయిన్‌గా కనిపించనున్నారు. ప్రస్తుతం దీని షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో అంజలి, శ్రీకాంత్‌, సునీల్‌, ఎస్‌.జె.సూర్య, సముద్రఖని, నవీన్‌ చంద్ర తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని