God Father: శరవేగంగా చిరంజీవి ‘గాడ్‌ ఫాదర్‌’షూటింగ్‌

చిరంజీవి(Chiranjeevi) కథానాయకుడిగా మోహన్‌ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పొలిటికల్‌ యాక్షన్‌ డ్రామా ‘గాడ్‌ ఫాదర్’.

Published : 25 Mar 2022 01:22 IST

ముంబయి: చిరంజీవి(Chiranjeevi) కథానాయకుడిగా మోహన్‌ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పొలిటికల్‌ యాక్షన్‌ డ్రామా ‘గాడ్‌ ఫాదర్’. మలయాళంలో ఘన విజయం సాధించిన ‘లూసిఫర్‌’రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ఖాన్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం ‘గాడ్‌ ఫాదర్’కు సంబంధించిన షూటింగ్‌ ముంబయిలో శరవేగంగా జరుగుతోంది. చిరు-సల్మాన్‌ఖాన్‌ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలను దర్శకుడు మోహన్‌రాజా తెరకెక్కిస్తున్నారు. సెట్‌లో సల్మాన్‌ ఉన్న ఫొటోలను చిత్ర బృందం విడుదల చేసింది.  ‘గాడ్‌ ఫాదర్‌ సెట్‌లో భారతీయ సినీ ప్రేక్షకులు ఎంతగానో అభిమానించే సల్మాన్‌ భాయ్‌తో దర్శకుడు మోహన్‌రాజా మధుర జ్ఞాపకాలు’ అంటూ పంచుకుంది.  నయనతార, సత్యదేవ్‌, గంగవ్వ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్‌ సంగీతం అందిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని