కొత్త టైటిల్‌తో ‘మిర్జాపూర్‌’..!

‘మిర్జాపూర్‌’.. ఇప్పుడు ఉత్తరాదిన హాట్‌టాపిక్‌ ఇదే. సినిమాలకు ధీటుగా వినోదం పంచగలమని ఈ వెబ్‌సిరీస్‌ నిరూపించింది. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్‌ప్రైమ్‌ వీడియోలో అత్యంత ఆదరణ పొందిన వెబ్‌సిరీస్‌గా రికార్డు సృష్టించింది. ఎంతటి విజయం సాధించిందో అదేస్థాయిలో వివాదాలనూ ఎదుర్కొంటోంది.

Published : 31 Jan 2021 01:31 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘మిర్జాపూర్‌’.. ఇప్పుడు ఉత్తరాదిన హాట్‌టాపిక్‌ ఇదే. సినిమాలకు ధీటుగా వినోదం పంచగలమని ఈ వెబ్‌సిరీస్‌ నిరూపించింది. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్‌ప్రైమ్‌ వీడియోలో అత్యంత ఆదరణ పొందిన వెబ్‌సిరీస్‌గా రికార్డు సృష్టించింది. ఎంతటి విజయం సాధించిందో అదేస్థాయిలో వివాదాలనూ ఎదుర్కొంటోంది. ఉత్తరప్రదేశ్‌లోని మిర్జాపూర్‌ పట్టణంలో జరిగే రౌడీయిజం, హింస నేపథ్యంలో తెరకెక్కిందీ సిరీస్‌. ఇప్పటికే వచ్చిన సీజన్‌1, సీజన్‌2 ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. సీజన్‌3 కూడా తెరకెక్కిస్తున్నట్లు అమెజాన్‌ ప్రైమ్‌ గతంలోనే ప్రకటించింది. అయితే.. అదే సమయంలో హింసను ప్రేరేపించడంతో పాటు మిర్జాపూర్‌ పట్టణాన్ని తప్పుగా చూపిస్తున్నారంటూ వెబ్‌సిరీస్‌పై అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ఈక్రమంలో సుప్రీంకోర్టు నుంచి కూడా నోటీసులు రావడంతో మిర్జాపూర్‌ సీజన్‌3పై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇదిలా ఉండగా.. ఈ వెబ్‌సిరీస్‌పై తాజాగా కొన్ని ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. 

హింస, రౌడీయిజం విషయాల్లో కాస్త వెనక్కి తగ్గి కొన్ని మార్పులతో సీజన్‌3ని తెరకెక్కించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కథలో మార్పులతో పాటు తారగణంలోనూ మార్పులకు అవకాశం లేకపోలేదు. అయితే.. తాము ఇంతవరకూ మార్పుల గురించి చర్చించలేదని, కానీ మార్పులు మాత్రం ఖచ్చితంగా ఉంటాయని దర్శకనిర్మాతలు స్పష్టం చేశారు. అన్నింటికంటే ముఖ్యంగా టైటిల్‌ విషయంలోనూ మార్పులు ఉండవచ్చని చెప్పారు. అయితే.. టైటిల్‌ను మారిస్తే కొత్త పేరుతో వచ్చే వెబ్‌సిరీస్‌ను ప్రేక్షకులు ఎంతమేరకు ఆదరిస్తారో వేచి చూడాలి. క్రైమ్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ వెబ్‌సిరీస్‌కు గుర్మీత్‌సింగ్‌ దర్శకత్వం వహించారు. పంకజ్‌త్రిపాఠి, అలీఫజల్‌, దివ్యెందు, శ్వేతాత్రిపాఠి, రసికా దుగల్‌ కీలక పాత్రల్లో నటించారు. ఈ సిరీస్‌ హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ అలరిస్తోంది.

ఇవీ చదవండి..

రివ్యూ: నారింజ మిఠాయి

‘మిర్జాపూర్‌’కు సుప్రీం కోర్టు నోటీసులు

‘మీర్జాపూర్‌’ను భ్రష్టుపట్టిస్తున్నారు: ఎంపీ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని