Sai Dharam Tej: సాయితేజ్‌కు యాక్సిడెంట్‌.. బైక్స్‌ అన్నీ అమ్మేశా: నవీన్‌ విజయ్‌ కృష్ణ

‘సత్య’ (Satya) షార్ట్‌ ఫిల్మ్‌తో దర్శకుడిగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు నవీన్‌ విజయ్‌ కృష్ణ (Naveen Vijay Krishna). తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

Published : 24 Aug 2023 18:46 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: నటుడు, తన స్నేహితుడు సాయిధరమ్‌ తేజ్‌ (Sai Dharam tej)కు జరిగిన యాక్సిడెంట్‌ తనకొక జీవిత పాఠాన్ని నేర్పిందని నటుడు నవీన్‌ విజయ్‌ కృష్ణ (Naveen Vijay Krishna) తెలిపారు. జీవితంలో ఎంత బాధ్యతగా ఉండాలో తెలిసి వచ్చిందన్నారు. ఆ ప్రమాదం తర్వాత తాను కొంతకాలం అందరికీ దూరంగా ఉన్నానని తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో  చెప్పారు.

‘‘ప్రమాదం జరగడానికి కొద్దిసేపటి ముందు నేనూ సాయి కలిసి బయటకు వెళ్లి వచ్చాం. నన్ను ఇంటి దగ్గర డ్రాప్‌ చేసి.. తను ఇంటికి వెళ్తున్నప్పుడు ప్రమాదం జరిగింది. సాయికి యాక్సిడెంట్‌ అయ్యిందని కాల్‌ రాగానే చిన్న ప్రమాదం అనుకున్నా. ఆస్పత్రికి వెళ్లి అక్కడి పరిస్థితి చూసి షాకయ్యా. ఆ ప్రమాదం నాకొక పెద్ద పాఠాన్ని నేర్పింది. జీవితంలో ఎక్కడ ఉన్నాం..? ఎంత బాధ్యతగా ఉండాలనే విషయాన్ని తెలియజేసింది. అప్పటికే నేను జీవితంలో ఎన్నో కోల్పోయా. అదే సమయంలో సాయికి యాక్సిడెంట్‌ కావడాన్ని తట్టుకోలేకపోయా. కొన్ని రోజులు ఎవరినీ కలవలేదు. ఫోన్‌ కూడా ఆఫ్‌ చేసుకున్నా. నా బైక్స్‌ అన్నీ అమ్మేశా’’ అని నవీన్‌ తెలిపారు.

క్రేజీ మూవీస్‌ ఈ వారమే.. ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయ్యే చిత్రాలు/సిరీస్‌లు!

అనంతరం తన కెరీర్‌ గురించి మాట్లాడుతూ.. ‘‘నాకు దర్శకత్వం అంటే ఎంతో ఇష్టం. డైరెక్టర్‌గా వర్క్‌ చేయాలని మొదటి నుంచి కలలు కనేవాడిని. విజయ నిర్మలమ్మ కోరిక మేరకే హీరోగా సినిమాల్లోకి వచ్చా. అది నాకు సెట్‌ కాదనిపించింది. అలా.. ఇటీవల ‘సత్య’ అనే షార్ట్‌ ఫిల్మ్‌ తెరకెక్కించా. సాయితేజ్‌కు కథ నచ్చడంతో యాక్ట్‌ చేస్తానని అన్నాడు. స్వాతి నాకు ‘డేంజర్‌’ సినిమా టైమ్‌ నుంచి తెలుసు. నా కథలో పాత్రకు ఆమె న్యాయం చేయగలదనిపించింది. ఫోన్‌ చేసి అడగ్గా వెంటనే ఓకే చేశారు’’ అని ఆయన చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని