Annapoorani: ఓటీటీలోకి ‘అన్నపూరణి’.. నెల రోజులు కాకముందే స్ట్రీమింగ్‌కు నయన్‌ కొత్త చిత్రం..!

నయనతార నటించిన సరికొత్త చిత్రం ‘అన్నపూరణి’ (Annapoorani) ఓటీటీ రిలీజ్‌కు రంగం సిద్ధమైంది.

Updated : 24 Dec 2023 16:44 IST

హైదరాబాద్‌: కథానాయిక ప్రాధాన్యమున్న చిత్రాలతో తరచూ ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తున్నారు కథానాయిక నయనతార (Nayanthara). ఇటీవల ఆమె నటించిన హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ మూవీ ‘అన్నపూరణి’ (Annapoorani). ‘ది గాడెస్‌ ఆఫ్‌ ఫుడ్‌’ అనేది ట్యాగ్‌ లైన్‌. నీలేష్‌ కృష్ణ దర్శకుడు. డిసెంబర్‌ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మిశ్రమ స్పందనలు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. థియేటర్‌లో విడుదలై నెల రోజులు కూడా కాకముందే ఇది ఓటీటీలోకి అడుగుపెడుతోంది. డిసెంబర్‌ 29 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషాల్లో స్ట్రీమింగ్‌ కానుంది.

Ram Charan: మెగా అభిమానులకు గుడ్‌న్యూస్‌.. లీగ్‌ క్రికెట్‌లోకి రామ్‌చరణ్‌..!

ఇక ‘అన్నపూరణి’ సినిమా విషయానికొస్తే.. నయనతార 75వ చిత్రం. సంప్రదాయ కుటుంబంలో జన్మించిన అమ్మాయి.. మాంసాహార వంటలకు సంబంధించిన రెస్టారెంట్‌ పెట్టుకోవాలనుకున్న తన కలను ఎలా నెరవేర్చుకుంది అనే కథతో ఇది తెరకెక్కింది. సత్యరాజ్‌, జై కీలక పాత్రలు పోషించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని