Nene Vasthunna: ఓటీటీలోకి ‘నేనే వస్తున్నా’.. రిలీజ్ డేట్‌ ఎప్పుడంటే?

విభిన్నమైన సైకో థ్రిల్లర్‌గా తెరకెక్కిన సినిమా ‘నేనే వస్తున్నా’. ధనుష్‌ ద్విపాత్రాభినయం పోషించిన ఈసినిమా ఓఓటీ రిలీజ్‌ డేట్‌ విడుదలైంది.

Published : 22 Oct 2022 14:24 IST

ఇంటర్నెట్‌డెస్క్‌‌: ప్రముఖ నటుడు ధనుష్‌ (Dhanush). ద్విపాత్రాభినయం పోషించిన సరికొత్త చిత్రం ‘నేనే వస్తున్నా’ (Nene Vasthunna). సెల్వ రాఘవన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్‌ నెలాఖరున విడుదలై తమిళ ప్రేక్షకులను అలరించినా, తెలుగులో అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడీ చిత్రం ఓటీటీ ఎంట్రీకి రంగం సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్ ప్రైమ్‌ వేదికగా అక్టోబర్‌ 27 నుంచి ఇది అందుబాటులో ఉండనుంది. వెలుగు, చీకటి మధ్య యుద్ధమే ఈ చిత్రమని ప్రైమ్‌ పేర్కొంది.

కథ ఏమిటంటే..

ఇదొక విభిన్నమైన సైకో థ్రిల్లర్‌. దీనికి హార‌ర్ ట‌చ్ ఇస్తూ ఆస‌క్తిక‌రంగా తీర్చిదిద్దాడు ద‌ర్శకుడు సెల్వ రాఘ‌వ‌న్‌. ఇద్దరు క‌వ‌ల సోద‌రులు. అందులో ఓ కుర్రాడు ప్రభు (ధ‌నుష్‌) మంచికి మారు పేరైతే.. మ‌రొక‌డు ఖదీర్‌ (ధ‌నుష్‌) మృత్యువుకు ప్రతిరూపంలా క‌నిపించే సైకో. తండ్రిని క్రూరంగా చంపాడ‌న్న కార‌ణంతో త‌ల్లి, త‌మ్ముడు అత‌న్ని చిన్నత‌నంలోనే ఒంట‌రిగా వ‌దిలేసి వెళ్లిపోతారు. మ‌రి ఇటు త‌ల్లి ప్రేమ‌కు, అటు సోద‌రుడి ప్రేమ‌కు దూర‌మైన ఆ కుర్రాడు చివ‌రికి ఎలా మారాడు? అత‌ని వ‌ల్ల ఆ త‌ల్లీ కొడుకులిద్దరికీ ఎలాంటి స‌వాళ్లెదుర‌య్యాయి? అన్న ఆసక్తికర అంశాలతో ఈ సినిమా రూపుదిద్దుకుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని