Nenu Student Sir: పోలీస్‌స్టేషన్‌పై బెల్లకొండ గణేశ్ కంప్లెయింట్.. ఎందుకంటే?
బెల్లకొండ గణేశ్ కీలక పాత్రలో రాఖీ ఉప్పలపాటి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘నేను స్టూడెంట్ సర్’. శనివారం ఈ చిత్ర టీజర్‌ను దర్శకుడు వి.వి.వినాయక్ విడుదల చేశారు.
హైదరాబాద్: సాధారణంగా ఏదైనా వస్తువు పోతే, పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తాం. కానీ, యువ కథానాయకుడు బెల్లకొండ గణేశ్ ఏకంగా పోలీస్‌స్టేషన్‌పైనే కంప్లెయింట్ చేశాడు. ఆయన కీలక పాత్రలో రాఖీ ఉప్పలపాటి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘నేను స్టూడెంట్ సర్’. అవంతిక దస్సాని కథానాయిక. శనివారం ఈ చిత్ర టీజర్‌ను దర్శకుడు వి.వి.వినాయక్ విడుదల చేశారు. తాను ఎంతో కష్టపడి రూ.89,999 పెట్టి కొనుకొన్న ఐఫోన్ పోవటానికి పోలీసులే కారణం అంటూ బెల్లకొండ గణేశ్ కమిషనర్‌కు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆశ్చర్యపోతారు. ఇంతకీ ఆ ఫోన్ ఎలా పోయింది? అందులో పోలీసుల పాత్ర ఏంటి? చివరకు ఆ ఫోన్ దొరికిందా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. మహతి స్వరసాగర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Pakistan: పాకిస్థాన్‌పై మరో పిడుగు.. త్వరలో ఇంధన సంక్షోభం..!
-
Sports News
Rishabh Pant: వేగంగా కోలుకుంటున్న రిషభ్ పంత్.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి ఎప్పుడంటే?
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
India News
Shanthi Bhushan: కేంద్ర మాజీ మంత్రి, లెజెండరీ న్యాయవాది శాంతి భూషణ్ కన్నుమూత
-
World News
Flight: 13 గంటలు ప్రయాణించి.. టేకాఫ్ అయిన చోటే దిగిన విమానం..!
-
Politics News
Andhra news: సీఎం జగన్ వ్యాఖ్యలపై సీజేఐకు లేఖ రాసిన రఘురామకృష్ణరాజు