Newsense: త్వరలోనే ‘న్యూసెన్స్ సీజన్ 2’..
నవదీప్, బిందు మాధవి కీలక పాత్రల్లో రూపొందిన సరికొత్త వెబ్‌సిరీస్ ‘న్యూసెన్స్: సీజన్ 1’కు యువత నుంచి విశేష ఆదరణ లభిస్తోందని మేకర్స్ తెలిపారు.
హైదరాబాద్: నవదీప్, బిందు మాధవి కీలక పాత్రల్లో రూపొందిన సరికొత్త వెబ్‌సిరీస్ ‘న్యూసెన్స్: సీజన్ 1’. ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ఆహాలో ఇటీవల స్ట్రీమింగ్ మొదలైన సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌కు యువత నుంచి విశేష ఆదరణ లభిస్తోందని మేకర్స్ తెలిపారు. ఇందులో భాగంగా సక్సెస్‌మీట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీ ప్రవీణ్ మాట్లాడుతూ ‘న్యూసెన్స్ సిరీస్‌ను అందరం ఎంతో ప్రేమించి చేశాం. అందువల్లే ఇంతటి అపూర్వమైన విజయం దక్కింది. అన్నిచోట్ల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఆహా, పీపుల్ మీడియా వారితో కలిసి వర్క్ చేయటం గొప్ప అనుభూతినిచ్చింది. వారు అందించిన సహయ సహకారాలతోనే మేం అనుకున్న కథను అనుకున్నట్లు తెరకెక్కించగలిగాం’’ అన్నారు. మరికొన్ని వారాల్లోనే ‘న్యూసెన్స్ సీజన్ 2’ను అందిస్తామని మేకర్స్ తెలియజేశారు. మరో ఆసక్తికరమైన, ఆలోచనను రేకెత్తించేలా ఉత్కంఠభరితమైన కథాంశంతో ముందుకు వస్తామని ఈ సందర్భంగా టీమ్ తెలియజేసింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
PM Modi: బాధ్యులపై కఠిన చర్యలు : ఒడిశా రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ
-
Movies News
Chiranjeevi: గతంలో నేను క్యాన్సర్ బారినపడ్డాను: చిరంజీవి
-
General News
Odisha Train Tragedy: రెండు రైళ్లలో ప్రయాణించిన 316 మంది ఏపీ వాసులు సురక్షితం
-
General News
Train accident: ‘కోరమాండల్’ కాస్త ముందొచ్చుంటే మరింత ఘోరం జరిగేది!
-
India News
Odisha Train Tragedy: 250 మంది ప్రయాణికులతో చెన్నైకి ప్రత్యేకరైలు
-
Movies News
Kota Srinivas Rao: హీరోల పారితోషికం బయటకు చెప్పటంపై కోట మండిపాటు!