Adipurush: నోట్ రాసిస్తా.. ఎవర్నీ నిరాశపర్చను: ఓంరౌత్
‘ఆదిపురుష్’ (Adipurush) టీజర్‌కు వస్తోన్న ప్రతికూల స్పందనలపై ఓం రౌత్ తాజాగా మరోసారి స్పందించారు. సినిమాతో తాను పూర్తి నమ్మకంతో ఉన్నట్లు చెప్పారు.
ముంబయి: ‘ఆదిపురుష్’ (Adipurush)పై పూర్తి నమ్మకంతో ఉన్నట్లు దర్శకుడు ఓం రౌత్ (Om Raut) తెలిపారు. ఈ సినిమా టీజర్‌కు వస్తోన్న ప్రతికూల స్పందనలపై ఆయన మరోసారి స్పందించారు. బిగ్ స్క్రీన్ కోసమే ఈ చిత్రాన్ని సిద్ధం చేశామన్నారు. ‘‘టీజర్ విషయంలో చాలా విమర్శలు వస్తున్నాయి. టీజర్లో కేవలం పాత్రల్ని మాత్రమే పరిచయం చేశాం. చిన్న వీడియోను చూసి సినిమాపై అంచనాకు రావొద్దు. వచ్చే ఏడాది జనవరి 12న ఈ సినిమా విడుదలయ్యాక.. చూసి ఎవరూ నిరాశచెందరు. కావాలంటే నోట్ రాసిస్తా. తప్పకుండా సినిమా అందర్నీ అలరిస్తుంది’’ అని ఓం రౌత్ అన్నారు.
ప్రభాస్ నో అంటే చేసేవాడిని కాదు!
‘‘ప్రభాస్ కోసమే రాఘవ పాత్ర రాశాను. కథ రాస్తున్నంతసేపు నా మైండ్‌లో ప్రభాసే ఉన్నాడు. ఆయన కోసమే సినిమా తెరకెక్కించా. ఆయన నో అంటే సినిమా చేసేవాణ్ని కాదు. ఆయన అద్భుతంగా నటించారు’’ అని ఓం రౌత్ వివరించారు.
రామాయణాన్ని ఆధారంగా చేసుకుని ‘ఆదిపురుష్’ను రూపొందించారు. ప్రభాస్ (Prabhas) రాముడిగా నటించగా కృతి సనన్ సీతగా చేసింది. రావణాసురుడిగా సైఫ్ అలీఖాన్ నటించాడు. రూ.300 కోట్లకు పైగా బడ్జెట్‌తో సినిమాను తెరకెక్కించినట్లు సమాచారం. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్లో నటీనటుల లుక్స్, వీఎఫ్ఎక్స్ సరిగ్గా లేవని విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Virender Sehwag : అప్పుడు దాన్ని తప్పనిసరి చేసిఉంటే.. చాలా మంది దిగ్గజాలు ఫెయిలై ఉండేవాళ్లు : సెహ్వాగ్
-
Crime News
TSPSC: రాజశేఖర్ ఇంట్లో మరికొన్ని ప్రశ్నపత్రాలు.. నాలుగో రోజు విచారణలో కీలక ఆధారాలు
-
General News
Ap Special Status: ఏపీకి ప్రత్యేక హోదాపై మరోసారి తేల్చి చెప్పిన కేంద్రం
-
Movies News
rangamarthanda review: రివ్యూ: రంగమార్తాండ
-
Sports News
Sachin - Sehwag: ముల్తాన్ టెస్టులో సిక్స్ కొడతానంటే.. సచిన్ అలా అనేశాడు: సెహ్వాగ్
-
World News
Medvedev: క్షిపణి రావొచ్చు.. ఆకాశాన్ని గమనిస్తూ ఉండండి: ఐసీసీకి మెద్వదేవ్ వార్నింగ్