OTT Movies: ఈ వారం ఓటీటీలో 10కి పైగా చిత్రాలు అలరించే వెబ్‌సిరీస్‌లు

ఈ వారం తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో అలరించే ఓటీటీ చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు ఇవే

Updated : 01 Dec 2022 16:27 IST

ఇప్పటికే విడుదలై సందడి చేసిన పలు చిత్రాలు ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయ్యేందుకు సిద్ధమవగా, ఆసక్తికర వెబ్‌సిరీస్‌లు సైతం వస్తున్నాయి. మరి డిసెంబరు మొదటి వారంలో అలరించే చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు మీకోసం..

నవలలో రాసినట్లే నిజ జీవితంలోనూ జరిగితే!

నవీన్ చంద్ర, మధుబాల కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘రిపీట్‌’. డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా డిసెంబరు 1వ తేదీ నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్‌ అవుతోంది. ఒక రచయిత రాసిన నవలలో మాదిరిగానే నేరాలు జరుగుతుంటాయి. అతను రాసినట్లే ఆ నేరాలు ఎలా జరగుతున్నాయి. వాటిని పోలీసులు ఎలా ఛేదించారు తదితర ఆసక్తికర విషయాలతో ఈ సినిమాను తీర్చిదిద్దారు. అరవింద్ శ్రీనివాసన్ ఈ మూవీని తెరకెక్కించారు.


తెలుగులో థియేటర్‌లో సందడి చేస్తుండగా, ఓటీటీలో

ప్రదీప్‌ రంగనాథన్‌ (Pradeep Ranganathan) స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్‌ లవ్‌ డ్రామా ‘లవ్‌ టుడే’ (Love Today). కోలీవుడ్‌లో మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా ఇప్పుడు తెలుగులోనూ థియేటర్‌లలో సందడి చేస్తోంది. ఈ క్రమంలో డిసెంబరు 2 నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా తమిళ్‌లో అందుబాటులోకి తెస్తున్నారు. సత్యరాజ్‌, రాధిక శరత్‌కుమార్‌, ఇవానా, రవీనా రవి తదితరులు కీలక పాత్రలు పోషించారు.


తెలుగులోనూ మోహన్‌లాల్‌ మాన్‌స్టర్‌

ప్రముఖ నటుడు మోహన్‌లాల్‌ (Mohanlal) నటించిన ‘మాన్‌స్టర్‌’ (Monster) డిసెంబరు 2న ‘డిస్నీ+ హాట్‌స్టార్‌’లో ఈ చిత్రం విడుదల కానుంది. తెలుగు, మలయాళం, తమిళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్‌ కానుంది. ఓ పాప కిడ్నాప్‌ నేపథ్యంగే సాగే ఈ థ్రిల్లర్‌ను వైశాఖ్‌ తెరకెక్కించారు. ఇందులో మంచు లక్ష్మి, హనీరోజ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు.


వెబ్‌సిరీస్‌ అలరించనున్న ఎస్‌జే సూర్య

దర్శకుడిగానే కాదు, నటుడిగానూ అలరిస్తున్నారు ఎస్‌.జె సూర్య. ఆయన కీలక పాత్రలో నటించిన వెబ్‌సిరిస్‌ వదంది (Vadhandhi). డిసెంబర్‌ 2 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. క్రైమ్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ వెబ్‌సిరీస్‌కు వసంత్‌ దర్శకత్వం వహించగా పుష్కర్‌, గాయత్రి నిర్మిస్తున్నారు.తెలుగు, హిందీతో పాటు కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో ఈ సిరీస్‌ డిజిటల్‌ ప్రేక్షకుల ముందుకు రానుంది.


అమితాబ్, రష్మికల చిత్రం కూడా..

కథానాయిక రష్మిక (Rashmika) బాలీవుడ్‌లో నటించిన తొలి చిత్రం ‘గుడ్‌ బై’ (GoodBye). అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachchan) కీలక పాత్ర పోషించారు. వికాస్‌ భల్‌ తెరకెక్కించారు. ఏక్తా కపూర్‌ నిర్మాత. అక్టోబర్‌ 7న థియేటర్‌లలో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా డిసెంబరు 2 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. అమితాబ్‌ కుమార్తెగా రష్మిక నటించారు.


లాక్‌డౌన్‌లో ఏం జరిగింది?

కరోనా నాటి వాస్తవ పరిస్థితులను ప్రతింబింబించేలా వస్తున్న చిత్రం ‘ఇండియన్‌ లాక్‌డౌన్‌’ (India Lockdown). మధుర్‌ భండార్కర్‌ దర్శకుడు. శ్వేత బసు ప్రసాద్‌, ప్రతీక్‌ బబ్బర్‌, సాయి తమంకర్‌, ప్రకాశ్‌ బెలవాడి, అహన్‌కుమ్రాలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ ఓటీటీ వేదికగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ జీ5 వేదికగా డిసెంబరు 2వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.


ఈ వారం అలరించే మరికొన్ని చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు

నెట్‌ఫ్లిక్స్‌

* క్రైమ్‌ సీన్‌ టెక్సాస్‌ కిల్లింగ్‌ ఫీల్డ్స్‌ (వెబ్‌సిరీస్‌) (స్ట్రీమింగ్‌ మొదలైంది)

* మై నేమ్‌ ఈజ్‌ వెండెట్టా (ఇటాలియన్‌ మూవీ) (స్ట్రీమింగ్‌ మొదలైంది)

* ట్రోల్‌ (నార్వేజియన్‌ మూవీ) డిసెంబరు 1

* జంగిల్‌లాండ్‌ (హాలీవుడ్) డిసెంబరు 1


జీ5

* మాసూన్‌ రాగా (కన్నడ) డిసెంబరు 2


ప్రైమ్‌ వీడియో

* క్రష్డ్‌ (వెబ్‌సిరీస్‌ సీజన్‌2) డిసెంబరు 2

* కాంతార (తుళు) డిసెంబరు 2


ఆహా

* క్రేజీ ఫెలో (తెలుగు) డిసెంబరు 3


డిస్నీ+హాట్‌స్టార్‌

* విల్లో  (వెబ్‌సిరీస్‌) (స్ట్రీమింగ్‌ మొదలైంది)

* డైరీ ఆఫ్‌ ఎ వింపీకిడ్‌: రోడ్రిక్‌ రూల్స్‌ డిసెంబరు 2

* ఫ్రెడ్డీ (బాలీవుడ్‌) డిసెంబరు 2


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని