Rahul Ramakrishna: ఇకపై సినిమాలు చేయను: రాహుల్‌ రామకృష్ణ

షార్ట్‌ ఫిలిం నటుడిగా కెరీర్‌ ఆరంభించి ‘అర్జున్‌రెడ్డి’తో హాస్యనటుడు, సహాయ నటుడిగా మంచి పేరు సొంతం చేసుకున్నారు నటుడు రాహుల్‌ రామకృష్ణ. ‘అర్జున్‌రెడ్డి’ విజయం తర్వాత వరుస ప్రాజెక్ట్‌లు ఓకే చేస్తూ...

Published : 05 Feb 2022 12:13 IST

నటుడి ట్వీట్‌తో నెటిజన్లు షాక్‌

హైదరాబాద్‌: షార్ట్‌ ఫిలిం నటుడిగా కెరీర్‌ ఆరంభించి ‘అర్జున్‌రెడ్డి’తో హాస్యనటుడు, సహాయ నటుడిగా మంచి పేరు సొంతం చేసుకున్నారు నటుడు రాహుల్‌ రామకృష్ణ. ‘అర్జున్‌రెడ్డి’ విజయం తర్వాత వరుస ప్రాజెక్ట్‌లు ఓకే చేస్తూ ఆయన కెరీర్‌లో దూసుకెళ్తున్నారు. రాజమౌళి తెరకెక్కించిన  ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లోనూ ఆయన ఓ రోల్‌ పోషించారు. తరచూ తన సినిమా అప్‌డేట్స్‌తో ట్విటర్‌ వేదికగా నెటిజన్లను పలకరించే ఆయన తాజాగా ఓ ట్వీట్‌ పెట్టి.. అందర్నీ షాక్‌కు గురిచేశాడు. ఇకపై తాను సినిమాలు చేయడం లేదంటూ చెప్పుకొచ్చారు. ‘‘2022.. ఇదే నా చివరిది. ఇకపై నేను సినిమాలు చేయను’’ అని ట్వీట్‌ చేశారు. రాహుల్‌ చేసిన ట్వీట్‌తో నెటిజన్లు ఆశ్చర్యానికి గురయ్యారు. ‘‘కెరీర్‌లో మంచి స్థాయిలో ఉన్న ఆయన ఉన్నట్టుండి సినిమాలు ఆపేస్తానంటూ ప్రకటించడం ఏంటి?’’, ‘‘ఇది ఏమైనా సినిమా ప్రమోషన్సా?’’, ‘‘నిజంగా బ్రేక్‌ తీసుకుంటున్నారా?’’ అని పలువురు అభిమానులు కామెంట్లు పెట్టారు. ఇక, ‘భరత్‌ అనే నేను’, ‘చిలాసౌ’, ‘గీత గోవిందం’, ‘బ్రోచేవారెవరురా’, ‘అల వైకుంఠపురములో’, ‘జాతిరత్నాలు’, ‘నెట్‌’, ‘స్కైలాబ్‌’ చిత్రాలు ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని