Kantara 2: ‘కాంతార2’లో రజనీకాంత్‌.. రిషబ్‌ మౌనం అందుకేనా..!

గతేడాది విడుదలై బ్లాక్‌బాస్టర్‌ విజయాన్ని అందుకుంది ‘కాంతార’ (Kantara). ‘కాంతార2’లో రజనీకాంత్‌ నటించనున్నారనే వార్త ప్రస్తుతం టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారింది.

Published : 20 Feb 2023 13:50 IST

హైదరాబాద్‌: దక్షిణాది సినిమా స్థాయిని పెంచేసిన సినిమాల్లో ‘కాంతార’ (Kantara) ఒకటి. చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం అన్ని భాషల్లో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుని కాసుల వర్షం కురిపించింది. ఈ సినిమా సూపర్‌ హిట్‌ అవ్వడంతో దీనికి కొనసాగింపు ఉండనున్నట్లు చిత్రబృందం పేర్కొంది. ఈ ప్రకటన వచ్చినప్పటి నుంచి అభిమానులు సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్‌ కోసం ఎదరుచూస్తున్నారు. అయితే తాజాగా ఈ మూవీపై ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది.

ఈ బ్లాక్‌బాస్టర్‌ సినిమా ప్రీక్వెల్‌లో సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ (Rajinikanth) నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఓ కార్యక్రమానికి హాజరైన రిషబ్‌ శెట్టి(Rishab Shetty)ని ఈ విషయం గురించి అడగ్గా.. ఆయన మౌనంగా వెళ్లిపోయారట. దీంతో ఈ వార్త నిజమేననుకుంటున్నారు. ఇది రూమర్‌ అయితే రిషబ్‌ స్పందించే వాడని.. ఏమీ చెప్పలేదంటే ‘కాంతార2’ (Kantara 2)లో రజనీ కనిపించడం ఖాయమని అంటున్నారు. దీనిపై అధికారిక ప్రకటన రాలేదు కానీ సోషల్‌మీడియాలో మాత్రం ‘‘సూపర్‌ హిట్‌ చిత్రంలో సూపర్‌ స్టార్‌’’ అంటూ ఇమేజ్‌లు షేర్‌ చేస్తున్నారు.

రజనీకాంత్‌ కూడా సందర్భం వచ్చినప్పుడల్లా కాంతార సినిమాపై, రిషబ్‌శెట్టిపై ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. రిషబ్‌ను రజనీ తన ఇంటికి పిలిచి సన్మానించి బహుమతి ఇచ్చారు. కాంతార సినిమా తనకెంతో నచ్చిందని సోషల్ మీడియాలోనూ చాలాసార్లు పేర్కొన్నారు. ఇక ‘‘కాంతార2’కు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. జూన్‌లో చిత్రీకరణ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. వచ్చే ఏడాదిలో పాన్‌ ఇండియా స్థాయిలో దీనిని విడుదల చేయనున్నాం’’ అని రిషబ్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని