Ram Charan: సిద్ధు.. అందుకు గర్వపడుతున్నా: రామ్‌చరణ్‌

‘టిల్లు స్క్వేర్‌’ (Tillu Square) చిత్రాన్ని వీక్షించారు రామ్‌చరణ్‌, రానా. చిత్రబృందాన్ని మెచ్చుకుంటూ పోస్టులు పెట్టారు.

Published : 07 Apr 2024 12:10 IST

హైదరాబాద్‌: సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్‌’ (Tillu Square). మల్లిక్‌ రామ్‌ దర్శకుడు. మార్చి 29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం  ఘన విజయాన్ని అందుకుంది. తాజాగా ఈ చిత్రాన్ని నటులు రామ్‌చరణ్‌, రానా వీక్షించారు. చిత్రబృందాన్ని ముఖ్యంగా సిద్ధూ జొన్నలగడ్డను మెచ్చుకుంటూ సోషల్‌మీడియాలో పోస్టులు పెట్టారు.

‘‘డియర్‌ సిద్ధూ.. ‘డీజే టిల్లు’తో నువ్వు అద్భుతమైన విజయాన్ని అందుకున్నందుకు నేను గర్వపడుతున్నా. కథానాయిక అనుపమ పరమేశ్వరన్‌, చిత్ర దర్శకుడు మల్లిక్‌ రామ్‌, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌తోపాటు చిత్రబృందం మొత్తానికి నా హృదయపూర్వక అభినందనలు’’ అని రామ్‌చరణ్‌ అన్నారు. సినిమా  నచ్చేసిందని రానా అన్నారు. సినిమా సినిమాకు తన టాలెంట్‌తో ప్రేక్షకులకు మెండైన వినోదాన్ని అందిస్తున్నారన్నారు. సిద్ధు అందుకున్న ఈ విజయం తనకెంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. ప్రస్తుతం ఈ పోస్టులు సినీ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

2022లో విడుదలైన ‘డీజే టిల్లు’కు సీక్వెల్‌గా ‘టిల్లు స్క్వేర్‌’ రూపుదిద్దుకుంది. మురళీ శర్మ, మురళీధర్‌ గౌడ్‌, బ్రహ్మాజీ, ప్రిన్స్‌ తదితరులు కీలకపాత్రలు పోషించారు. టిల్లుగా సిద్ధూ యాక్టింగ్‌, కామెడీ టైమింగ్‌, పంచ్‌ డైలాగ్స్‌ ప్రేక్షకులను విపరీతంగా ఆకర్షించాయి. ‘డీజే టిల్లు’కు మించి ఇది ఉందని సినీ ప్రియులు అభిప్రాయపడుతున్నారు. విడుదలైన ఎనిమిది రోజుల్లోనే రూ.96.6 కోట్ల గ్రాస్‌ వసూళ్లు రాబట్టిందని నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పేర్కొంది. ఏప్రిల్‌ 8న సక్సెస్‌ మీట్‌ జరగనుంది. ఎన్టీఆర్‌ ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని