Ramcharan: రామ్‌చరణ్‌ గ్రాండ్‌ దీపావళి పార్టీ.. హాజరైన మహేశ్‌బాబు, ఎన్టీఆర్‌.. ఫొటోలు వైరల్‌

రామ్‌చరణ్‌ (Ramcharan) నివాసంలో జరిగిన దీపావళి వేడుకల్లో టాలీవుడ్‌ తారలు సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

Published : 12 Nov 2023 11:57 IST

హైదరాబాద్‌: దీపావళి వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా నటుడు రామ్‌చరణ్‌ (Ram charan)- ఉపాసన (Upasana) దంపతులు తాజాగా ఓ గ్రాండ్‌ పార్టీ ఏర్పాటు చేశారు. శనివారం రాత్రి హైదరాబాద్‌లోని తమ నివాసంలో ఈ వేడుకలు జరిగాయి. వెంకటేశ్‌, మహేశ్‌బాబు - నమ్రత, ఎన్టీఆర్‌ - ప్రణతీ దంపతులతోపాటు టాలీవుడ్‌కు చెందిన నటీనటులు, దర్శక నిర్మాతలు ఈ పార్టీలో సందడి చేశారు. విందు భోజనం, గేమ్స్‌తో అందరూ సరదాగా గడిపారు. పార్టీకి సంబంధించిన కొన్ని ఫొటోలను నమ్రత తాజాగా ఇన్‌స్టాలో షేర్‌ చేశారు. ప్రస్తుతం ఇవి నెట్టింట వైరల్‌గా మారాయి.

Salaar: ‘సలార్‌’ నుంచి క్రేజీ అప్‌డేట్‌.. ప్రభాస్‌ లుక్‌కు ఫ్యాన్స్‌ ఫిదా.!

తమ కుమార్తె క్లీంకారకు ఇది తొలి దీపావళి కావడంతో చరణ్‌ దంపతులు ఈ గ్రాండ్‌ పార్టీని ఏర్పాటు చేసినట్లు టాక్‌. ఇక, సినిమాల విషయానికి వస్తే.. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తర్వాత చరణ్‌ నటిస్తోన్న చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’. శంకర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. కియారా అడ్వాణీ కథానాయిక. ప్రస్తుతం ఇది చిత్రీకరణ దశలో ఉంది. ఈసినిమా తర్వాత చరణ్‌ - బుచ్చిబాబు కాంబోలో సినిమా పట్టాలెక్కనుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని