Ritika Singh: ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు: రితికా సింగ్‌

రితికా సింగ్‌ రజనీకాంత్‌తో నటించే అవకాశం వచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

Updated : 14 Mar 2024 17:12 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘గురు’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన నటి రితికాసింగ్‌ (Ritika Singh). అగ్ర కథానాయకుడు సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ (Rajinikanth) కొత్త చిత్రం ‘వెట్టయాన్‌’లో రితికా నటిస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు టి.జె జ్ఞానవేల్‌ తెరకెక్కిస్తున్నారు. తెలుగులో ‘వేటగాడు’ పేరుతో విడుదల కానుంది. ఇందులో అమితాబ్‌, ఫహద్‌ ఫాజిల్‌, రానా, మంజు వారియర్‌, దుషారా విజయన్‌ కీలకపాత్రలు పోషిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. అనిరుధ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌. తాజాగా రితికా సింగ్‌ షూటింగ్‌లో రజనీకాంత్‌తో ఉన్న ఫొటోను ఇన్‌స్టాలో షేర్‌ చేశారు. ‘‘తలైవర్‌ దయ, ప్రకాశం సాటిలేనివి. ఆయనతో ఉంటే ఎలా అనిపిస్తుందో ఇందులో ఉన్న పాట వివరిస్తుంది. ఆయన ఉనికిని చాటి చెప్తుంది. రజనీకాంత్‌తో కలిసి వర్క్‌ చేయడం ఆనందంగా ఉంది. ఈ సినిమాలో నటించే అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు’’ అని రితికా సింగ్‌ పోస్ట్‌ పెట్టారు.

రితికా సింగ్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘వళరి’ (Valari). మ్రితిక సంతోషిణి తెరకెక్కించిన ఈ సినిమా ప్రముఖ తెలుగు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ ఈటీవీ విన్‌లో మార్చి 6 నుంచి స్ట్రీమింగ్‌ అవుతోంది.  శ్రీరామ్‌, ఉత్తేజ్‌ కీలక పాత్రల్లో నటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని