Chinni: ఇంతకు ముందెప్పుడూ చూడని పాత్రలో కీర్తిసురేశ్‌

మహానటి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న కీర్తిసురేష్‌ తెలుగు, తమిళ భాషల్లో విభిన్న చిత్రాలు చేస్తూ మంచి పేరు తెచ్చుకుంటుంది.

Updated : 22 Apr 2022 17:22 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మహానటి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న కీర్తిసురేష్‌ తెలుగు, తమిళ భాషల్లో విభిన్న చిత్రాలు చేస్తూ మంచి పేరు తెచ్చుకుంటోంది. ఓవైపు భారీ స్థాయి సినిమాలు చేస్తూనే.. మరోవైపు లేడీ ఓరియంటెడ్‌ చిత్రాల్లో అలరిస్తోంది. అలా కీర్తి ప్రధాన పాత్రలో నటించిన తమిళ చిత్రం ‘సాని కాయిదం’ ఈ సినిమా తెలుగులో ‘చిన్ని’ పేరుతో అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. ట్రైలర్‌ను బట్టి చూస్తే కీర్తి సురేష్‌ ఈ సినిమాలో డీ గ్లామరస్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. క్రైమ్‌ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంలో సెల్వ రాఘవన్‌ ప్రధాన ప్రాత్రలో కనిపించనున్నారు. అరుణ్‌ మతేశ్వరన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మే 6 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. హీరో ధనుష్‌ ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇందులో  ‘ప్రతీకారం తీర్చుకోవడమంటే ఏంటి’ అంటూ కీర్తి తన నటనతో ఆకట్టుకుంది


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని