Sai Dharam Tej: పెళ్లిపై సాయిధరమ్‌ తేజ్‌ సరదా వ్యాఖ్యలు

‘బ్రో’ (BRO) సెకండ్‌ సాంగ్‌ విడుదల కార్యక్రమంలో సాయిధరమ్‌ తేజ్‌ (Sai Dharam Tej) తన పెళ్లిపై సరదా వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా తర్వాత పరిస్థితులు మారిపోయాయని అన్నారు.

Published : 15 Jul 2023 15:58 IST

తిరుపతి: పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan), సాయిధరమ్‌ తేజ్‌ (Sai dharam Tej) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘బ్రో’ (Bro). కోలీవుడ్‌ హిట్‌ మూవీ ‘వినోదాయ సిథం’కు రీమేక్‌గా సముద్రఖని దీన్ని రూపొందించారు. తాజాగా ఈ సినిమా నుంచి సెకండ్‌ సాంగ్‌ విడుదలైంది. తిరుపతిలోని ఎన్వీఆర్‌ జయశ్యామ్‌ థియేటర్‌ వేదికగా జరిగిన పాట విడుదల కార్యక్రమంలో సాయిధరమ్‌ తేజ్‌ పాల్గొన్నారు. కాసేపు సరదాగా అభిమానులతో ముచ్చటించారు. ‘‘పెళ్లి ఎప్పుడు?’’ అంటూ ఫ్యాన్స్‌ అడగ్గా.. ఆయన ఫన్నీగా రిప్లై ఇచ్చారు.

‘‘మీ అభిమానాన్ని పొందడం కోసమే ఈ ప్రాంతానికి వచ్చాను. మా గురువుగారు (పవన్‌కల్యాణ్‌) నాకు అవకాశం ఇవ్వడం వల్లే ఈ సినిమాలో నేను భాగమయ్యా. ఆయనతో కలిసి స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నందుకు ఆనందంగా ఉంది. ఇదొక గొప్ప అనుభూతి. దీన్ని మాటల్లో వర్ణించలేను. (సాయి మాట్లాడుతుండగా పెళ్లెప్పుడు? అంటూ అభిమానులు ప్రశ్నించారు. వారికి సమాధానం చెబుతూ..) ఇంకెక్కడ పెళ్లి బ్రో. ఈ సినిమా ముందు వరకూ ఎవరో ఒకరు ట్రై చేసేవారు. కానీ, ఈ సినిమా టైటిల్‌ రిలీజ్‌ అయ్యాక అందరూ నన్ను బ్రో అని పిలుస్తున్నారు’’ అంటూ ఆయన నవ్వులు పూయించారు.

అమర్‌నాథ్‌ యాత్రలో సాయిపల్లవి.. ఆ దృశ్యంతో మనసు తరించిందన్న నటి

అనంతరం తన అభిమానులను ఉద్దేశిస్తూ.. ‘‘ఆ దేవుడు నాకిచ్చిన సెకండ్‌ ఛాన్స్‌ ఇది. దయచేసి మీరందరూ జాగ్రత్తగా ఉండండి. ఇందాకే చూశా.. ఒక్కరు కూడా హెల్మెట్‌ పెట్టుకోవడం లేదు. బైక్‌ డ్రైవ్‌ చేసేటప్పుడు హెల్మెట్‌ పెట్టుకోండి. మీరు క్షేమంగా ఉండాలని నేను కోరుకుంటున్నా’’ అని ఆయన తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని