Sai Dharam Tej: మునుపటికన్నా మెరుగుపడాలి.. బ్రేక్‌ తీసుకుంటా: సాయిధరమ్‌ తేజ్‌

పవన్‌ కల్యాణ్‌, సాయిధరమ్‌ తేజ్‌ కలిసి నటించిన చిత్రం ‘బ్రో’. త్వరలోనే ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో సాయి తేజ్‌ ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు.

Published : 19 Jul 2023 02:14 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తన ఆరోగ్యం మునుపటికన్నా మెరుగుపడేందుకు సినిమాకు ఆరు నెలలు బ్రేక్‌ ఇచ్చి, విశ్రాంతి తీసుకోనున్నట్టు హీరో సాయిధరమ్‌ తేజ్‌ (Sai Dharam Tej) తెలిపారు. ప్లేట్‌ రిమూవల్‌ సర్జరీ ఉందని చెప్పారు. ‘బ్రో’ (Bro) సినిమా ప్రచారంలో భాగంగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలు తెలిపారు. సముద్రఖని (Samuthirakani) దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సాయిధరమ్‌ తేజ్‌తోపాటు ఆయన మావయ్య, అగ్ర నటుడు పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) నటించారు. కేతిక శర్మ (Ketika Sharma), ప్రియా ప్రకాశ్‌వారియర్‌ (Priya Prakash Varrier) కథానాయికలు. ఈ సినిమా జులై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.

స్టార్‌గా ఎదిగి.. ట్యాక్సీ డ్రైవర్‌గా మారి: ‘ప్రేమదేశం’ అబ్బాస్‌ అనుభవాలివీ

ఈ సినిమా చిత్రీకరణలో పవన్‌ కల్యాణ్‌ 21 రోజులు పాల్గొన్నారని సాయిధరమ్‌ తేజ్‌ తెలిపారు. తాను 24 రోజులు షూటింగ్‌లో పాల్గొన్నట్టు పేర్కొన్నారు. ప్రారంభంలో దాదాపు 15 నిమిషాలు మినహా సినిమా అంతా పవన్‌ కల్యాణ్‌ కనిపిస్తారని చెప్పారు. తమిళ సినిమా ‘వినోదాయ సిథం’లోని సోల్‌ని మాత్రమే తీసుకున్నామని, దర్శకుడు త్రివిక్రమ్‌ తనదైన శైలి స్క్రీన్‌ప్లే, సంభాషణలు అందించారన్నారు. ఇటీవల విడుదలైన రెండు పాటలపై వచ్చిన విమర్శలపై స్పందిస్తూ.. సంగీత దర్శకుడు తమన్‌ కథకు తగ్గట్టే పాటలందించారని చెప్పారు. 2021లో సాయిధరమ్‌ తేజ్‌ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. దాన్నుంచి కోలుకున్న తర్వాత ‘విరూపాక్ష’లో నటించారు. ఇటీవల విడుదలైన ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ విజయోత్సాహంలోనే ‘బ్రో’లో నటించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని