Sai pallavi: సాయి పల్లవి పెళ్లిపై మరోసారి రూమర్స్‌.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

హీరోయిన్‌ సాయిపల్లవి (Sai Pallavi) పెళ్లిపై మరోసారి రూమర్స్‌ వచ్చాయి. వీటిపై విరాటపర్వం దర్శకుడు వేణు ఊడుగుల క్లారిటీ ఇచ్చారు.

Updated : 21 Sep 2023 13:03 IST

హైదరాబాద్‌: నటి సాయి పల్లవికి (Sai Pallavi) సంబంధించిన ఓ ఫొటో రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దర్శకుడు రాజ్‌కుమార్‌ పెరియస్వామితో ఆమె ఉన్న ఫొటోను షేర్‌ చేస్తూ.. సాయిపల్లవి పెళ్లి చేసుకున్నారంటూ కొందరు నెటిజన్లు ప్రచారం చేస్తున్నారు. అయితే, ఆ వార్తలో ఎటువంటి వాస్తవం లేదని తేలింది.

నటుడు శివ కార్తికేయన్‌తో కలిసి సాయి పల్లవి ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. రాజ్‌కుమార్‌ పెరియస్వామి ఆ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. 'SK21' అనే వర్కింగ్‌ టైటిల్‌తో ఇది రూపొందుతోంది. ఈ సినిమా పూజా కార్యక్రమంలో భాగంగా చిత్రబృందంతో పాటు సాయిపల్లవి, దర్శకుడు కూడా మెడలో దండలు వేసుకుని ఫొటోలు దిగారు. ఇప్పుడు ఆ ఫొటోను షేర్‌ చేస్తూ ఆమె పెళ్లి అంటూ రూమర్స్‌ సృష్టిస్తున్నారు. ఇదే విషయంపై ‘విరాటపర్వం’ దర్శకుడు వేణు ఊడుగుల కూడా క్లారిటీ ఇచ్చారు. ఆ ఫొటో సినిమా ప్రారంభం సందర్భంగా తీయించుకున్నట్లు తెలుపుతూ తన సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశారు.

ప్రస్తుతం నాగచైతన్య హీరోగా తెరకెక్కనున్న సినిమాలో సాయి పల్లవి నటించనుంది. ఈ చిత్రానికి చందూ మొండేటి దర్శకత్వం వహించనున్నారు. ప్రీ ప్రొడక్షన్స్‌ పనులు శరవేగంగా జరుగుతున్న ఈ సినిమా చిత్రీకరణ త్వరలోనే ప్రారంభం కానుంది. #NC23 అనే వర్కింగ్‌ టైటిల్‌తో ఇది రూపొందనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని