Naga Chaitanya: యూట్యూబ్‌ ఛానల్‌ ప్రారంభించిన నాగ చైతన్య.. జాబ్‌ లేదంటూ ఆన్సర్‌!

హీరో నాగ చైతన్య యూట్యూబ్‌ ఛానల్‌ ప్రారంభించారు. శుక్రవారం ఓ వీడియోను పోస్ట్‌ చేశారు.

Updated : 18 Nov 2023 05:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సినీ తారలకు, అభిమానులకు మధ్య సామాజిక మాధ్యమాలు వారధిగా నిలుస్తున్నాయి. వ్యక్తిగత వివరాలతోపాటు తమ చిత్రాల విశేషాలను సెలబ్రిటీలు సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంటూ వారికి దగ్గరగా ఉంటున్నారు. ‘ఎక్స్‌’ (ట్విటర్‌), ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌తోపాటు యూట్యూబ్‌ ఛానల్‌ను ప్రారంభించి తమ సినిమాలను వినూత్నంగా ప్రచారం చేసుకుంటున్నారు. ప్రముఖ హీరో నాగ చైతన్య తాజాగా ఆ జాబితాలో చేరారు. అక్కినేని నాగ చైతన్య (Akkineni Naga Chaitanya) పేరుతో ఛానల్‌ క్రియేట్‌ చేసిన ఆయన శుక్రవారం ఓ వీడియో పోస్ట్‌ చేశారు. అందులో ఓ వ్యక్తి ప్రశ్నించగా నాగ చైతన్య సరదాగా సమాధానం చెబుతూ కనిపించారు.

కన్నూర్‌ స్క్వాడ్‌.. మమ్ముట్టి మలయాళ బ్లాక్‌బస్టర్‌ ఎలా ఉంది?

‘చాలాకాలం తర్వాత జుట్టు, గడ్డం పెంచారు. కారణమేంటో తెలుసుకోవచ్చా?’ అని అడగ్గా ‘ఆరు నెలలుగా జాబ్‌ లేదు. ఇంట్లో ఖాళీగా ఉంటున్నా. పనేంలేక జుట్టు, గడ్డం పెంచా’ అంటూ తనలోని కామెడీ టైమింగ్‌ చూపించారు. తాను హీరోగా చందూ మొండేటి తెరకెక్కించునున్న #NC23 (వర్కింగ్‌ టైటిల్‌) సినిమా కోసం పెంచినట్లు తర్వాత క్లారిటీ ఇచ్చారు. కొన్ని రోజుల క్రితం ఫస్ట్‌లుక్‌ ఫొటోషూట్‌ జరిగిందని, ఔట్‌పుట్‌ బాగా వచ్చిందని తెలిపారు. తాను నటించిన తొలి వెబ్‌సిరీస్‌ ‘దూత’ గురించి మాట్లాడుతూ.. దూత ఎవరో తెలియాలంటే సోషల్‌ మీడియాలో దర్శకుడు విక్రమ్‌ కె.కుమార్‌ ఖాతాను ట్యాగ్‌ చేసి అడిగితే ఆన్సర్‌ వస్తుందని చెప్పారు.

‘ప్రేమమ్‌’, ‘సవ్యసాచి’ చిత్రాల తర్వాత చైతన్య- చందూ కాంబినేషన్‌లో రూపొందునున్న చిత్రమే #NC23. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. మత్స్యకారుల జీవితాలను అద్దం పట్టే ఓ యథార్థ కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమా కోసం శరీరాకృతిని పూర్తిగా మార్చుకుంటున్నారు చైతన్య. ఇందులో సాయి పల్లవి కథానాయిక. విక్రమ్‌ కె. కుమార్‌ దర్శకత్వం వహించిన ‘దూత’ ప్రముఖ ఓటీటీ అమెజాన్‌ ప్రైమ్‌లో డిసెంబరు 1 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని