Samyuktha: కాలేజీ విద్యార్థులకు సంయుక్త సర్‌ప్రైజ్‌.. బహుమతి ఏంటో తెలుసా?

నటి సంయుక్త (Samyuktha) మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. ఇటీవల ‘విరూపాక్ష’ (Virupaksha) దర్శకుడికి ఫోన్‌ గిఫ్ట్‌గా ఇచ్చిన ఆమె తాజాగా ఇద్దరు కాలేజీ విద్యార్థులను సర్‌ప్రైజ్‌ చేశారు.

Updated : 30 Apr 2023 18:00 IST

హైదరాబాద్‌: సినీ నటి సంయుక్త (Samyuktha) తన మంచి హృదయాన్ని చాటుకున్నారు. బస్సుల్లో ప్రయాణం చేసి కాలేజీకి చేరుకుంటోన్న ఇద్దరు అమ్మాయిలను సర్‌ప్రైజ్‌ చేస్తూ ఆమె బహుమతులు ఇచ్చారు. సంయుక్త సాయంతో వారిద్దరూ పట్టరాని ఆనందంలో మునిగి తేలుతున్నారు.

‘విరూపాక్ష’ (virupaksha) ప్రమోషన్స్‌లో భాగంగా చిత్రబృందం ఇటీవల ఓ రియాల్టీ షోలో పాల్గొంది. సాయిధరమ్‌ తేజ్‌ - సోనియాసింగ్‌, సంయుక్త - రవికృష్ణ బృందాలుగా ఏర్పడి ఇందులో సందడి చేశారు. ఈ ప్రోగ్రామ్‌లోని ఓ సెగ్మెంట్‌లో బహుమతిగా వచ్చే స్కూటీని షోలో పాల్గొన్న కాలేజీ అమ్మాయిల్లో ఎవరో ఒకరికి ఇవ్వాలని సాయితేజ్‌ (Sai Dharam Tej) అనుకున్నారు. ఆయన సాయంతో సంయుక్త - రవికృష్ణ టీమ్‌ స్కూటీని గెలుపొందింది. అయితే, ఆ స్కూటీ తనకు వద్దని సాయితేజ్‌ మాట ప్రకారం ఓ అమ్మాయికి దాన్ని బహుమతిగా ఇచ్చేస్తానని సంయుక్త చెప్పారు. ఈ క్రమంలోనే సింగిల్‌ పేరెంట్‌ ఉన్న ఇద్దరు అమ్మాయిలను సెలెక్ట్‌ చేసుకున్న ఆమె షోలో తాను గెలుచుకున్న బైక్‌ను ఒకరికి ఇచ్చేశారు. మరొకరికి కొత్త స్కూటీ తానే స్వయంగా కొనిస్తానని మాటిచ్చారు. సంయుక్త మాటలతో ఆనందించిన ఆ ఇద్దరూ ఆమెను ప్రేమగా ఆలింగనం చేసుకున్నారు. దీనిని చూసిన నెటిజన్లు సంయుక్త మంచి మనసును మెచ్చుకుంటున్నారు. ‘బ్యూటీ విత్‌ గోల్డెన్‌ హార్ట్‌’ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మరోవైపు ఆమె ఇటీవల ‘విరూపాక్ష’ దర్శకుడు కార్తిక్‌కు ఫోన్‌ కొని ఇచ్చిన విషయం తెలిసిందే. సినిమా ప్రచారంలో భాగంగా థియేటర్‌కు వెళ్లిన ఆయన ఫోన్‌ పోగొట్టుకున్నారని తెలిసి, ఖరీదైన ఐఫోన్‌ కొనుగోలు చేసి గిఫ్ట్‌గా ఇచ్చారు.

ఇక, మలయాళీ పరిశ్రమకు చెందిన సంయుక్త.. సింగిల్‌ పేరెంట్‌ కిడ్‌. ఆమె తల్లిదండ్రులు కొన్నేళ్ల క్రితమే విడాకులు తీసుకున్నారు. చిన్నప్పటి నుంచి ఆమె తల్లే కుటుంబపోషణ చూసుకున్నారు. అందుకే ఈ షోలో సింగిల్‌ పేరెంట్‌ ఉన్న అమ్మాయిలను ఆమె ఎంచుకుని ఈవిధంగా సాయం చేసి ఉండొచ్చని నెటిజన్లు భావిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని