Sandeep Vanga: బాలీవుడ్‌లో చర్చనీయాంశమైన సందీప్ వంగా కామెంట్స్.. స్పందిస్తోన్న ప్రముఖులు

‘యానిమల్‌’ దర్శకుడు సందీప్ వంగా (Sandeep Reddy Vanga) చేసిన కొన్ని కామెంట్స్ ప్రస్తుతం బాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి.

Updated : 06 Feb 2024 11:57 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘యానిమల్‌’ చిత్రం మంచి విజయాన్ని సాధించి దర్శకుడు సందీప్‌ వంగా స్థాయిని పెంచింది. అయితే, ఈ సినిమాపై వచ్చిన విమర్శలపై అతని కామెంట్స్‌ బాలీవుడ్‌లో చర్చనీయాంశమవుతున్నాయి. వాటిపై స్టార్స్‌ స్పందిస్తున్నారు. ప్రముఖ రచయిత జావేద్‌ అక్తర్‌ (Javed Akhtar) గతంలో ఈ చిత్రంలోని సన్నివేశాన్ని పరోక్షంగా విమర్శించిన సంగతి తెలిసిందే. ఇలాంటి చిత్రాలు ప్రమాదకరమన్నారు. దీనిపై సందీప్ (Sandeep Reddy Vanga) తాజాగా ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించారు. ‘‘మీర్జాపుర్‌’ సిరీస్‌లో ఎన్నో అభ్యంతరకరమైన పదాలు ఉన్నాయి. ఆ సినిమాను నిర్మించిన ఫర్హాన్‌ అక్తర్‌ (జావేద్‌ కుమారుడు)కు సలహా ఇవ్వమనండి. ప్రపంచంలో ఉన్న అసభ్యపదాలన్నీ అందులోనే ఉన్నాయి. నేను దాన్ని పూర్తిగా చూడలేదు. ప్రకటనల్లో వచ్చిన సీన్స్ చూసే వాంతి వచ్చిన ఫీలింగ్ కలిగింది. ముందు తన కుమారుడు నిర్మించే వాటిపై జావేద్‌ను శ్రద్ధపెట్టమనండి..’’ అని ఘాటుగా రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు బాలీవుడ్‌లో తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి.

సందీప్‌.. నాకు మీ చిత్రంలో అవకాశం ఇవ్వకండి: కంగనా రనౌత్‌

అదే ఇంటర్వ్యూలో సందీప్ వంగా.. స్టార్ హీరోయిన్ కంగనా (Kangana Ranaut) గురించి మాట్లాడుతూ.. ‘ఆమె నా ‘యానిమల్’పై నెగిటివ్‌ రివ్యూ ఇచ్చినా నాకేం ఇబ్బందిలేదు. నేను తీయనున్న సినిమాలో ఆమెకు సరిపోయే పాత్ర ఏదైనా ఉంటే  స్టోరీ చెబుతాను. ఆమె నటించిన ‘క్వీన్‌’ నాకు చాలా నచ్చింది. అందులో జీవించింది’ అన్నారు. దీనిపై కంగనా స్పందిస్తూ..‘సినిమాను సమీక్షించడానికి, విమర్శించడానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ‘యానిమల్‌’పై నా రివ్యూ గురించి మీరు నవ్వుతూ చెప్పారు. అది మీకు నాపై ఉన్న గౌరవం అయిఉండొచ్చు. కానీ, మీ సినిమాల్లో నాకు ఎలాంటి పాత్రలు ఇవ్వకండి. అలా ఇస్తే.. మీ ఆల్ఫా హీరోలు ఫెమినిస్ట్‌లు అవుతారు. అది మీకే ప్రమాదకరం. సినీ పరిశ్రమకు మీరు కావాలి’ అంటూ వ్యంగ్యంగా సమాధానం చెప్పింది.

సందీప్ వంగా చిత్రాలపై ఆమిర్‌ ఖాన్‌ మాజీ భార్య విమర్శలు.. స్ట్రాంగ్‌ రిప్లై ఇచ్చిన దర్శకుడు

నేను సందీప్ సినిమాల గురించి మాట్లాడలేదు..: ఆమిర్‌ ఖాన్‌ మాజీ భార్య కిరణ్‌ రావు

 సందీప్ వంగా తనపై చేసిన కామెంట్ల గురించి ఆమిర్‌ ఖాన్ మాజీ భార్య కిరణ్‌ రావు (Kiran Rao) స్పందించారు. ‘నేను ప్రత్యేకించి సందీప్‌ చిత్రాల గురించి మాట్లాడలేదు. కొన్ని సినిమాల్లో స్త్రీలను కించపరిచేలా సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని అన్నాను. ఇదే విషయం నేను గతంలోనూ చాలా వేదికలపై చెప్పాను. నేను తన సినిమాల గురించే మాట్లాడుతున్నానని ఎందుకు ఊహించుకున్నారో నాకు తెలియదు. మీరు ఈ విషయం ఆయన్నే అడగండి’ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని