Siren Movie: ఓటీటీ కాదు.. ‘సైరెన్‌’ మోగేది థియేటర్‌లోనే!

జయం రవి, కీర్తి సురేష్‌ కీలక పాత్రల్లో నటించిన ‘సైరెన్‌’మూవీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ చేశారు.

Updated : 23 Jan 2024 14:57 IST

హైదరాబాద్‌: జయం రవి, కీర్తి సురేష్‌ కీలక పాత్రల్లో నటిస్తున్న యాక్షన్‌ ప్యాక్డ్‌ ఎమోషనల్‌ డ్రామా చిత్రం ‘సైరెన్‌’ (Siren Movie). 108.. అనేది ఉపశీర్షిక. ఆంటోని భాగ్యరాజ్‌ దర్శకత్వంలో రానున్న ఈ సినిమా ఓటీటీలో విడుదల కానుందంటూ జోరుగా ప్రచారం జరిగింది. అయితే, తాము ఓటీటీలో విడుదల చేయడం లేదని, తమిళ, తెలుగు భాషల్లో థియేటర్‌లోనే విడుదల చేస్తామని చిత్ర బృందం తెలిపింది. విడుదల తేదీని ప్రకటిస్తూ జయం రవి, కీర్తి సురేష్‌ కొత్త పోస్టర్‌లను పంచుకున్నారు. ఫిబ్రవరి 16వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

‘అంబులెన్స్‌ డ్రైవర్‌గా పనిచేసి క్రిమినల్‌గా మారిన ఓ వ్యక్తి కథ’గా థ్రిల్లింగ్‌ కథనంతో అలరించనుందీ చిత్రం. 14 ఏళ్ల తర్వాత ఆ వ్యక్తి జైలు నుంచి బయటికొచ్చి ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు అనేది సినిమాలో చూపించనున్నారు.  కీర్తి ఇందులో పోలీసు ఆఫీసర్‌గా కనిపించనున్నారు. అనుపమ పరమేశ్వరన్‌ కీలక పాత్ర పోషించిన ఈ సినిమాకు జీవీ ప్రకాశ్‌ కుమార్‌ సంగీతం అందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని