చిన్న పిల్లలా ఈషా.. కొవిడ్‌కి జగపతి థ్యాంక్స్‌

రెండు జడలు వేసుకుని చిన్న పిల్లలా దర్శనమిచ్చింది యువ నాయిక ఈషా రెబ్బా. 

Published : 19 Apr 2021 01:22 IST

సోషల్‌లుక్‌: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: రెండు జడలు వేసుకుని చిన్న పిల్లలా దర్శనమిచ్చింది యువ నాయిక ఈషా రెబ్బా.

* దివంగత నటుడు వివేక్‌తో దిగిన ఫొటోల్ని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది బాలీవుడ్‌ నటి ఊర్వశి రౌతేలా.

* బరువు తగ్గించుకునే పనిలో పడ్డారు నటి, నిర్మాత చార్మి. ఇంట్లో చేసిన వ్యాయామాన్ని ఫొటో రూపంలో పంచుకున్నారామె.

* ‘వకీల్‌ సాబ్‌’ చిత్రానికి సంబంధించిన ఆఖరి ప్రచారంలో పాల్గొన్నాను అంటూ ఆనందం వ్యక్తం చేసింది నివేదా థామస్‌. కొవిడ్‌ బారిన పడటంతో గతంలో ప్రచారం చేయలేకపోయింది నివేదా.

* హాస్యం, ఆశ్చర్యం, ఆలోచించడం.. ఇలా వివిధ రకాల పోజుల్లో సందడి చేస్తోంది రష్మిక.

* తనకు తనే మేకప్‌ వేసుకుంటూ కనిపించారు నటుడు జగపతి బాబు. ‘కొవిడ్‌కి ధన్యవాదాలు.. నేను మేకప్‌మెన్‌ అయ్యాను (నవ్వుతూ)’ అని రాసుకొచ్చారు.


























Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని