Faima: రింగ్‌ తొడిగి లవ్‌ ప్రపోజ్‌ చేసిన ప్రవీణ్‌.. ‘జబర్దస్త్‌’ ఫైమా భావోద్వేగం

తమదైన కామెడీ టైమింగ్‌తో బుల్లితెర ప్రేక్షకుల్ని నవ్వించే పటాస్‌ ప్రవీణ్‌-ఫైమా ఎమోషనల్‌ అయ్యారు. ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ వేదికపై ఫైమాపై తనకున్న ప్రేమను వ్యక్తం చేసి, ఆమె వేలికి ప్రవీణ్‌ ఉంగరం తొడిగారు.

Published : 14 Jul 2022 20:37 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తమదైన కామెడీ టైమింగ్‌తో బుల్లితెర ప్రేక్షకుల్ని నవ్వించే పటాస్‌ ప్రవీణ్‌ (Pataas Praveen)- ఫైమా (Faima) ఎమోషనల్‌ అయ్యారు. ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ (Sridevi Drama Company) వేదికపై ఫైమాపై తనకున్న ప్రేమను వ్యక్తం చేసి, ఆమె వేలికి ప్రవీణ్‌ ఉంగరం తొడిగారు. తనకు ఫైమా ఎందుకు నచ్చిందో చెప్తూ.. ‘‘మనకంటూ ఓ సొంతిల్లు ఉండాలి. నేను అందులోనే చనిపోవాలి’ అని ఫైమా వాళ్ల అమ్మ తనను కోరింది. ఆవిడ కోరికను ఫైమా నెరవేర్చింది’’ అని ప్రవీణ్‌ వివరించారు. ఈ మాటలతో తన ప్రయాణాన్ని గుర్తుచేసుకున్న ఫైమా కంటతడి పెట్టుకున్నారు. అనంతరం, ‘ఫైమా.. మీ అమ్మకు చెప్పు అల్లుడొస్తున్నాడని’ అంటూ ప్రవీణ్‌ ఫైమాను నవ్వించారు. మరి, నిజంగానే ప్రవీణ్‌ లవ్‌ ప్రపోజ్‌ చేశారా? స్కిట్‌లో భాగంగా అలా చెప్పారా? తెలియాలంటే ‘ఈటీవీ’లో (ETV) ఈ ఆదివారం మధ్యాహ్నం 1:00 గం.కు ప్రసారం కానున్న పూర్తి ఎపిసోడ్‌ చూడాల్సిందే. తాజాగా విడుదలైన ప్రోమోలో ఈ లవ్‌ సీన్‌తోపాటు నటి సంఘవితో హైపర్‌ ఆది చేసిన కామెడీ, బుల్లెట్‌ భాస్కర్‌ టీమ్‌ పంచ్‌లు, బుల్లితెర నటుల రొమాంటిక్‌ డ్యాన్స్‌ పెర్ఫామెన్స్‌ చూడొచ్చు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని