Sundeep Kishan: త్రినాథరావు నక్కిన డైరెక్షన్‌లో సందీప్‌ కిషన్.. అప్‌డేట్‌ ఇచ్చిన హీరో

టాలీవుడ్‌ యువ కథానాయకుడు సందీప్‌ కిషన్ కొత్త సినిమాను ప్రకటించారు.

Updated : 12 Mar 2024 15:42 IST

హైదరాబాద్‌: విభిన్నమైన కథనాలు ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నారు టాలీవుడ్‌ యంగ్‌ హీరో సందీప్‌ కిషన్‌ (Sundeep Kishan). ఇటీవల ‘ఊరుపేరు భైరవకోన’ (Ooru Peru Bhairavakona) చిత్రంతో ప్రేక్షకులను పలకరించిన సందీప్‌ తన 30వ సినిమాను ప్రకటించారు. ‘ఎస్‌కె30’ వర్కింగ్‌ టైటిల్‌ను ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. ‘ధమాకా’ మూవీతో మంచి హిట్‌ అందుకున్న దర్శకుడు త్రినాథరావు నక్కిన ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌, హాస్య మూవీస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి ప్రసన్న కుమార్‌ బెజవాడ కథ, మాటలు అందిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి. వినోదాత్మక చిత్రంగా తెరకెక్కిస్తారని టాక్‌ వినిపిస్తుంది. 

సందీప్‌ కిషన్‌- వీఐ ఆనంద్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఊరు పేరు భైరవకోన’. వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్‌ కథానాయికలు. ఫిబ్రవరి 15న థియేటర్‌లో విడుదలైన ఈ సినిమాను మహాశివరాత్రి సందర్భంగా ఓటీటీలో రిలీజ్‌ చేశారు. ప్రస్తుతం అమెజాన్‌ ఫ్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్‌ అవుతోంది. 

మరోవైపు సందీప్‌ కోలీవుడ్‌లోనూ సినిమాలు చేస్తున్నారు. ఇటీవల విడుదలైన తమిళ మూవీ ‘కెప్టెన్‌ మిల్లర్‌’(Captain Miller)లో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం ‘రాయన్‌’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ రెండు సినిమాల్లోనూ ధనుష్‌ కథానాయకుడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని