Viruman: సూర్య, కార్తిలకు డైమండ్‌ బ్రాస్‌లెట్‌, గోల్డ్‌ చైన్‌లు...

కార్తి(Karthi), అదితి శంకర్‌(Aditi Shankar) జంటగా నటించిన తమిళ చిత్రం ‘విరుమన్’(Viruman) ఈ నెల(ఆగస్టు)11న విడుదలయ్యింది. ఈ చిత్ర నిర్మాతలుగా నటులు సూర్య(Suriya)...

Published : 19 Aug 2022 01:41 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కార్తి(Karthi), అదితి శంకర్‌(Aditi Shankar) జంటగా నటించిన తమిళ చిత్రం ‘విరుమన్’(Viruman) ఈ నెల(ఆగస్టు)11న విడుదలయ్యింది. ఈ చిత్ర నిర్మాతలుగా నటులు సూర్య(Suriya), జ్యోతిక(Jyothika) వ్యవహరించారు. ఎం‌.ముత్తయ్య(M. Muthaiah) దర్శకత్వం వహించిన ఈ సినిమా తమిళనాడులో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సందర్భంగా ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్‌, శక్తి ఫిల్మ్‌ ఫ్యాక్టరీ అధినేత బి.శక్తివేలన్‌ విజయోత్సవ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ వేదికపై బి.శక్తివేలన్‌ ‘విరుమన్‌’  చిత్ర  కథానాయకుడు కార్తి, నిర్మాత సూర్య, సహ నిర్మాత పాండియన్‌ను సన్మానించి, డైమండ్‌ బ్రాస్‌లెట్‌ బహూకరించారు. చిత్ర దర్శకుడు ఎమ్‌.ముత్తయ్యకు డైమండ్‌ రింగ్‌ ప్రదానం చేశారు.

ఎన్నో వాయిదాల అనంతరం విడుదలైన ‘విరుమన్‌’ మంచి వసూళ్లను సాధిస్తోందని డిస్ట్రిబ్యూటర్‌ ఎం.ముత్తయ్య తెలిపారు. 2డీ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మించిన ఈ  చిత్రం ఈ ఏడాది తమిళంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో నిలిచింది. ‘విరుమన్‌’ లో ప్రముఖ దర్శకుడు శంకర్‌(Shankar) కుమార్తె, గాయని అదితి శంకర్‌ కథానాయికగా నటించడం మరో విశేషం. ఇక నటుడు కార్తి చిత్రాలను పరిశీలిస్తే అతను కీలకపాత్ర పోషించిన పాన్‌ ఇండియా చిత్రం ‘పొన్నియన్‌సెల్వన్‌ 1’(Ponniyin Selvan 1) వచ్చే సెప్టెంబరు 30న విడుదల కానుంది. మరో చిత్రం ‘సర్దార్‌’(Sardar) అక్టోబరులో విడుదలవనుంది.    


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని