Jai Bhim: న్యాయం జరగాలి

‘‘లా అనేది ఓ శక్తిమంతమైన ఆయుధం. ఎవర్ని కాపాడటం కోసం మనం దాన్ని ఉపయోగిస్తున్నామన్నదే ముఖ్యం’’ అంటున్నారు కథానాయకుడు సూర్య. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తూ..

Published : 25 Oct 2021 14:47 IST

‘‘లా అనేది ఓ శక్తిమంతమైన ఆయుధం. ఎవర్ని కాపాడటం కోసం మనం దాన్ని ఉపయోగిస్తున్నామన్నదే ముఖ్యం’’ అంటున్నారు కథానాయకుడు సూర్య. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తూ.. స్వీయ నిర్మాణంలో రూపొందించిన చిత్రం ‘జై భీమ్‌’. తా.సే.జ్ఞానవేల్‌ తెరకెక్కించారు. ఈ చిత్ర ట్రైలర్‌ శుక్రవారం విడుదలైంది. వాస్తవ సంఘటనల ఆధారంగా అల్లుకున్న ఓ కోర్టు డ్రామా కథాంశంతో ఈ చిత్రం రూపొందించారు. ప్రచార చిత్రాన్ని బట్టి.. అన్యాయానికి గురైన ఓ గిరిజన కుటుంబం కోసం పోరాడే న్యాయవాదిగా సూర్య నటించినట్లు అర్థమవుతోంది. ఆయనకు వ్యతిరేకంగా వాదించే లాయర్‌గా రావు రమేష్‌ నటించారు. ట్రైలర్‌లో ఇద్దరి మధ్య సాగిన వాదనలు ఆసక్తికరంగా ఉన్నాయి. ‘‘బాధింపబడ్డ వాళ్లు ఎవరైనా.. ఎంతమంది ఉన్నా న్యాయం జరగాలి. దాన్ని నిరూపించడం న్యాయస్థానం యొక్క కనీస ధర్మం’’, ‘‘తప్పు చేసేవాడికి పదవి, డబ్బు, జాతి అనేవి చాలా ఉన్నాయి సర్‌. బాధింపబడ్డ వాళ్లకి మనమే కదా సర్‌ ఉంది’’... అంటూ ట్రైలర్‌లో వినిపించిన సంభాషణలు ఆలోచింపజేసేలా ఉన్నాయి. ఈ సినిమా తమిళం, తెలుగు, హిందీ భాషల్లో నవంబరు 2న అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో విడుదల కానుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని