Bigg Boss 5: సిరి అవసరమా నీకు? మానస్‌ నన్ను భరించావా.. నటించావా? హౌస్‌మేట్స్‌కు అదిరే ప్రశ్నలు!

అగ్ర కథానాయకుడు అక్కినేని నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ‘బిగ్‌బాస్‌ సీజన్‌-5’ తుది దశకు చేరుకుంటోంది. ఆఖరి ఫన్‌డేలో భాగంగా నాగ్‌ ఆదివారం సాయంత్రం ఆరుగురి కంటెస్టెంట్స్‌తో సరదాగా ఆటలు ఆడించారు...

Updated : 12 Dec 2021 16:56 IST

హైదరాబాద్‌: నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ‘బిగ్‌బాస్‌ సీజన్‌-5’ తుది దశకు చేరుకుంటోంది. ఆఖరి ఫన్‌డేలో భాగంగా నాగ్‌ ఆదివారం సాయంత్రం ఆరుగురి ఇంటి సభ్యులతో సరదాగా ఆటలు ఆడించారు. కంటెస్టెంట్స్‌ అందరికీ కొన్ని చిటీలు ఇచ్చి.. అందులో ఉన్న పాటను సైగలు చేసి ఇతర ఇంటిసభ్యులకు తెలియజేయాలని కోరారు. ఈ గేమ్‌లో సన్నీ, మానస్‌, షణ్ముఖ్‌.. సైగల ద్వారా చెప్పడానికి తెగ ఇబ్బందిపడగా.. సిరి సునాయాసంగా గెలుపొందారు. మరోవైపు, ఇంటి నుంచి వెళ్లిపోయిన హౌస్‌మేట్స్‌ వివిధ రకాల ప్రశ్నలు అడిగారు. షణ్ముఖ్‌, సిరిల బంధంపై జెస్సీ ఘాటు ప్రశ్నలు అడగ్గా ‘హౌస్‌లో నన్ను భరించావా? నటించావా’ అని మానస్‌ను ప్రియాంక అడిగింది. ఇక ‘టికెట్‌ టు ఫినాలే’ గెలుచుకొని శ్రీరామ్ నేరుగా టాప్‌ ఫైవ్‌లో నిలవగా.. శనివారం నాడు జరిగిన ఎపిసోడ్‌లో సెకండ్‌ ఫైనలిస్ట్‌గా సన్నీ ఎంపికయ్యాడు. మిగిలిన ఇంటిసభ్యులైన షణ్ముఖ్‌, సిరి, మానస్‌, కాజల్‌లలో.. ఎవరు టాప్‌ ఫైవ్‌లో నిలుస్తారో?ఎవరు ఈ వారం ఎలిమినేట్‌ అవుతారో?తెలియాల్సి ఉంది.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని