OTT: ఈ వారంలో రాబోతున్న చిత్రాలివే!
OTT Movies: ఈ వారం కూడా పలు చిత్రాలు ఓటీటీ వేదిక ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. మరి చిత్రాలేంటో చూసేయండి.
ఇంటర్నెట్‌డెస్క్: కరోనా కేసులు తగ్గినా, పరిస్థితులు ఇంకా పూర్తిగా కుదటపడని నేపథ్యంలో పలు చిత్రాలు ఓటీటీ బాటపడుతున్న సంగతి తెలిసిందే. థియేటర్లు తెరిచినా ఏ మేరకు ప్రేక్షకులు వస్తారన్నది ప్రశ్నార్థకమే. దీంతో దర్శక-నిర్మాతలు తమ చిత్రాలను ఓటీటీల్లో విడుదల చేస్తున్నారు. గతవారంలాగే ఈ వారం కూడా పలు చిత్రాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. మరి చిత్రాలేంటో చూసేయండి.
వెంకటేశ్ ‘నారప్ప’
అగ్ర కథానాయకుడు వెంకటేశ్ కీలక పాత్రలో శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నారప్ప’. ప్రియమణి, కార్తీక్ రత్నం, రాజీవ్ కనకాల కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎప్పుడో చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా కరోనా సెకండ్ వేవ్ కారణంగా విడుదల వాయిదా పడింది. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వేదికగా జులై 20 ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళ సూపర్‌హిట్ ‘అసురన్’ రీమేక్‌గా దీనిని తెరకెక్కించారు.
ఆర్య ‘సార్పట్ట’
ఇప్పటివరకూ క్రీడా నేపథ్యంతో చాలా చిత్రాలు వచ్చాయి. అయితే, పీరియాడికల్ డ్రామాకు బాక్సింగ్‌ను జోడించి పా.రంజిత్ తెరకెక్కించిన చిత్రం ‘సార్పట్ట’. ఆర్య కీలక పాత్రలో నటించారు. వేసవిలో థియేటర్లలో సందడి చేయాల్సిన ఈ సినిమా కరోనా దెబ్బకు ఇప్పుడు ఓటీటీ బాట పట్టింది. ఈనెల 22న అమెజాన్ ప్రైమ్‌లో తమిళం, తెలుగు భాషల్లో ఒకేసారి విడుదల కానుంది.
ఇక్కత్(కన్నడ)
విడాకులు తీసుకోవాలనుకున్న ఓ జంట.. కరోనా లాక్డౌన్ కారణంగా ఒకే ఇంట్లో రోజుల తరబడి ఉండాల్సి వస్తుంది. అప్పుడు ఏం జరిగింది? చివరకు ఏమైంది? అనే కథే ‘ఇక్కత్’. కామెడీ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం.. అమెజాన్ ప్రైమ్‌లో ఈ నెల 21 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈషం ఖాన్, హసీన్ ఖాన్ ఈ సినిమాను తెరకెక్కించారు.
14 ఫెరే (హిందీ)
విక్రాంత్ మస్సే, కృతి కర్బందా జంటగా, దేవాన్షు సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన సోషల్ కామెడీ డ్రామా మూవీ ‘14 ఫెరే’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా జులై 23న జీ5 వేదికగా విడుదల కానుంది. పెళ్లికి సిద్ధమైన ఓ ప్రేమజంట.. ఇంట్లో వాళ్లను నొప్పించకుండా ఒకటి కావాలనుకుంటారు. ఈ క్రమంలో అద్దెకు తెచ్చిన తల్లిదండ్రుల సమక్షంలో వివాహం చేసుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగింది అనే కథతో తీసిన సినిమా ‘14 ఫెరే’.
హంగామా 2 (హిందీ)
2003లో బాలీవుడ్లో వచ్చిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘హంగామా’. దానికి కొనసాగింపుగా.. మలయాళ సూపర్‌హిట్ ‘మిన్నారం’ రీమేక్‌గా వస్తున్న చిత్రం ‘హంగామా2’. శిల్పాశెట్టి, మిజాన్ జెఫ్రీ, పరేశ్ రావల్, ప్రణీత తదితరులు కీలక పాత్రలు పోషించారు. ప్రియదర్శన్ తెరకెక్కించారు. రెండు కుటుంబాల మధ్య జరిగే హాస్యభరిత సంఘటనల కథే ఈ సినిమా. జులై 23 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వేదికగా ఇది స్ట్రీమింగ్ కానుంది.
‘హీరో’గా రానున్న రిషభ్ శెట్టి
రిషభ్‌శెట్టి కీలక పాత్రలో భరత్‌రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన కన్నడ చిత్రం ‘హీరో’. ఈ ఏడాది మార్చిలో కన్నడ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ సినిమా తెలుగులో ‘హీరో’ పేరుతోనే అలరించేందుకు సిద్ధమైంది. ‘బెల్‌బాటమ్’ చిత్రంతో తెలుగువారికి సుపరిచితుడైన నటుడు రిషభ్‌శెట్టి ఇందులో నటించారు. బ్లాక్ కామెడీ నేపథ్యంతో రూపొందించిన ఈ సినిమా జులై 24న ‘ఆహా’లో విడుదల కానుంది.
అలరించనున్న మరికొన్ని చిత్రాలు/వెబ్ సిరీస్‌లు
* ‘ద లాస్ట్ లెటర్ ఫ్రమ్ యువర్ లవర్’ (జులై 23- నెట్‌ఫ్లిక్స్)
* ఫీల్స్ లైక్ ఇష్క్ (జులై 23- నెట్‌ఫ్లిక్స్)
* స్కై రోజో సీజన్ 2 (జులై 23- నెట్‌ఫ్లిక్స్)
* టెడ్ లాసో సీజన్ 2 (జులై 23- యాపిల్ టీవీ ప్లస్)
* మర్డర్ ఇన్ హిల్స్ (బెంగాలీ సిరీస్ జులై 23- హోయ్‌చోయ్)
* హాస్టల్ డేజ్ సీజన్ 2 (జులై 23- అమెజాన్ ప్రైమ్)
* కింగ్డమ్: అసిన్ ఆఫ్ నార్త్ (జులై 24- నెట్‌ఫ్లిక్స్)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓటీటీలోకి రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
మమితా బైజు నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘ప్రణయ విలాసం’. ఈటీవీ విన్ వేదికగా ఇది ప్రసారం కానుంది. -
భారీ ధరకు ‘తండేల్’ ఓటీటీ రైట్స్.. చైతూ కెరీర్లో బిగ్ డీల్
తండేల్ మూవీ ఓటీటీ డీల్ పూర్తయింది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్ రైట్స్ దక్కించుకుంది. -
ఓటీటీలోకి ‘మంజుమ్మల్ బాయ్స్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
సర్వైవల్ థ్రిల్లర్ ‘మంజుమ్మల్ బాయ్స్’ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. -
ఓటీటీలోకి ‘డియర్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
జి.వి.ప్రకాశ్ కుమార్, ఐశ్వర్య రాజేశ్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘డియర్’. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారైంది. -
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
సిద్ధార్థ్ మల్హోత్రా-రాశీఖన్నా ప్రధానపాత్రలో నటించిన చిత్రం ‘యోధ’ ఓటీటీలోకి వచ్చేసింది. -
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. -
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
అక్షయ్‌కుమార్, పంకజ్ త్రిపాఠి కీలక పాత్రల్లో నటించిన ‘ఓఎంజీ2’ తెలుగు వెర్షన్ ఇప్పుడు స్ట్రీమింగ్కు తీసుకొచ్చింది జియో సినిమా. -
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
తాను నటించిన ‘హీరామండీ’ వెబ్‌సిరీస్ త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో సోనాక్షి ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు. -
తెలుగులో ‘నాయట్టు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
మలయాళ చిత్రం ‘నాయట్టు’ ఇప్పుడు తెలుగు ఆడియోతో అందుబాటులోకి వచ్చేందుకు సిద్ధమైంది. -
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
సిద్ధు జొన్నలగడ్డ - అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. త్వరలో ఇది ఓటీటీలో విడుదల కానుంది. -
ఈటీవీ విన్లో ఆకట్టుకుంటోన్న క్రైమ్ కామెడీ చిత్రం
ఈటీవీ విన్ వేదికగా విడుదలైన 'శర్మ & అంబానీ' ప్రేక్షకాదరణ పొందుతోంది. -
ఓటీటీలో ‘గామి’ సరికొత్త రికార్డు.. ఎన్ని మిలియన్ల వీక్షణలంటే..
‘గామి’ ఓటీటీలోనూ రికార్డు సృష్టించింది. ఈ విషయాన్ని తెలుపుతూ జీ5 సంస్థ ప్రత్యేక పోస్టర్‌ను రిలీజ్ చేసింది. -
ఓటీటీలోకి కన్నడ బ్లాక్‌బస్టర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
కన్నడ నటుడు దర్శన్ (Darshan) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘కాటేరా’ (Kaatera) -
ఓటీటీలోకి ‘భీమా’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
‘భీమా’ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. -
ఓటీటీలోకి వచ్చేస్తోన్న కీర్తి సురేశ్ ఎమోషనల్ డ్రామా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే
కీర్తి సురేశ్ నటించిన ‘సైరన్’ ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది. -
‘ఏజెంట్’ ఓటీటీ రిలీజ్‌పై నెటిజన్ పోస్ట్.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత
అఖిల్ నటించిన ‘ఏజెంట్’ ఓటీటీ విడుదలపై నిర్మాత మరోసారి స్పందించారు. -
ఓటీటీలోకి వచ్చేస్తోన్న కామెడీ ఎంటర్టైనర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
‘ఓం భీమ్ బుష్’ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. అమెజాన్ ప్రైమ్ వేదికగా ప్రసారం కానుంది. -
ఓటీటీలోకి ‘ప్రేమలు’ తెలుగు వెర్షన్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే.?
ఇటీవల కాలంలో యూత్‌ను బాగా ఆకర్షించిన మలయాళీ ప్రేమకథా చిత్రం ‘ప్రేమలు’. ఇప్పుడు ఇది ఓటీటీ వేదికగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. -
ఈ వారం ఓటీటీలో సినిమాలే సినిమాలు.. ఏ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ అంటే..?
బయట ఎండలు మండిపోతున్నాయి. థియేటర్లో వరుస చిత్రాలు సందడి చేస్తున్నాయి. అయినా, ప్రతీ వారం ఇంటికి వచ్చి మరీ వినోదాన్ని పంచుతున్నాయి ఓటీటీ చిత్రాలు. మరి ఈ వారం ఏ ఓటీటీ వేదికగా ఏ సినిమాలు, సిరీస్‌లు స్ట్రీమింగ్ అవుతున్నాయో చూసేయండి. -
‘సేవ్ ది టైగర్స్2’ రికార్డు.. ఇండియాలోనే టాప్..
కుటుంబ ప్రేక్షకులను అలరించిన సేవ్ ది టైగర్స్ సీజన్2 రికార్డు సృష్టించింది. -
ఓటీటీలో ‘ఫైటర్’ రికార్డులు.. ఆ హాలీవుడ్ మూవీని దాటేసింది!
Fighter ott: ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న హృతిక్ రోషన్ ‘ఫైటర్’ రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతోంది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/04/24)
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి చేదు అనుభవం
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
అప్పట్లో.. 4 సెకన్లు ఆలస్యంగా చంద్రయాన్ 3.. ఎందుకంటే!
-
‘బాయ్‌ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!