Rana Daggubati: రానా నట విజృంభణ.. ఉత్కంఠగా ‘1945’ ట్రైలర్‌

రానా హీరోగా సత్యశివ తెరకెక్కించిన పీరియాడిక్‌ డ్రామా చిత్రం ‘1945’.  రెజీనా కథానాయిక.

Published : 04 Jan 2022 21:46 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రానా హీరోగా సత్యశివ తెరకెక్కించిన పీరియాడిక్‌ డ్రామా చిత్రం ‘1945’. రెజీనా కథానాయిక. సత్యరాజ్‌, నాజర్‌ కీలక పాత్రలు పోషించారు. సి. కల్యాణ్‌ నిర్మించారు. ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ సినిమా అనివార్య కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు 2021 డిసెంబరు 31 విడుదల చేయాలని భావించినా సాధ్యపడలేదు. సంక్రాంతి కానుకగా జనవరి 7న విడుదల చేసేందుకు చిత్ర బృందం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే తెలుగు ట్రైలర్‌ను విడుదల చేయగా తాజాగా తమిళ్‌ వెర్షన్‌ ట్రైలర్‌ను విడుదల చేసింది. ఇందులోని రానా నటన ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునేలా ఉంది. కొన్ని పవర్‌ఫుల్‌ సన్నివేశాల్లో రానా నట విశ్వరూపం చూపారు. రానా, రెజీనా ప్రేమకథ మెప్పిస్తోంది. రానా ‘ఇండియన్‌ నేషనల్‌ ఆర్మీ’లో చేరే సన్నివేశం సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.

Read latest Cinema News and Telugu News


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని