3 Roses: ముగ్గురు అమ్మాయిలు.. మూడు విభిన్న కథలు..!

పాయల్‌ రాజ్‌పుత్‌, ఈషా రెబ్బా, పూర్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సిరీస్‌ ‘3 రోజెస్‌’. ప్రముఖ దర్శకుడు మారుతి షో రన్నర్‌గా వ్యవహరిస్తున్నారు....

Updated : 06 Sep 2022 15:44 IST

ఆకట్టుకునేలా ‘3 రోజెస్’ టీజర్‌

హైదరాబాద్‌: పాయల్‌ రాజ్‌పుత్‌, ఈషా రెబ్బా, పూర్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సిరీస్‌ ‘3 రోజెస్‌’. ప్రముఖ దర్శకుడు మారుతి షో రన్నర్‌గా వ్యవహరిస్తున్నారు. మగ్గీ దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్‌ నవంబర్‌ 12 నుంచి ఆహా వేదికగా ప్రసారం కానుంది. ఈ సందర్భంగా ‘3 రోజెస్‌’ టీజర్‌ని నటి నిధి అగర్వాల్‌ సోషల్‌మీడియా వేదికగా విడుదల చేశారు. ‘3 రోజెస్‌’ టీమ్‌కి అభినందనలు తెలిపారు. విజయాన్ని అందుకోవాలని కోరారు.

వేర్వేరు ప్రాంతాలకు చెందిన ముగ్గురు అమ్మాయిలు.. ఒకేచోట కలిసి స్నేహితులయ్యాక.. వాళ్ల కథలు ఎటు మలుపు తిప్పాయి. అస్సలు సమాజంలో వాళ్లు ఎదుర్కొన్న ఇబ్బందులేమిటి? అనే ఆసక్తికర అంశంతో ఈ సిరీస్‌ తెరకెక్కినట్లు తెలుస్తోంది. ‘‘అసలు మనిద్దరికీ ఎందులోనైనా మ్యాచ్‌ అవుతుందా? కుక్కకి కులూమనాలికీ ఉన్నంత తేడా ఉంది’’ అంటూ వైవా హర్షతో ఈషా రెబ్బా చెప్పే డైలాగ్‌లు నవ్వులు పూయించేలా ఉన్నాయి. 30 సంవత్సరాలు వచ్చినా పెళ్లి చేసుకోకపోవడానికి గల కారణాన్ని చెబుతూ.. అబ్బాయికి బట్టతల, పొట్ట.. ఈ రెండూ ఉండకూడదని పూర్ణ కండీషన్‌ పెట్టడం సరదాగా అనిపించింది. ప్రస్తుతం ఈ టీజర్‌ నెటిజన్లను ఎంతో ఆకర్షిస్తోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని