Thalaivar169: ‘రజనీకాంత్‌ 169’.. రజనీ- నెల్సన్‌ కాంబో ఇకపై అధికారికం

‘తలైవా 169’ చిత్రం ఖరారైంది. రజనీకాంత్‌ హీరోగా నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ తెరకెక్కిస్తున్నారు.

Published : 10 Feb 2022 19:04 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ నటుడు రజనీకాంత్‌ 169వ చిత్రంపై కోలీవుడ్‌లో గత కొన్ని రోజులుగా చర్చ సాగుతోంది. ‘డాక్టర్‌’ ఫేం నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నారంటూ వార్తలొచ్చాయి. దీనిపై స్పష్టత వచ్చింది. రజనీకాంత్‌- నెల్సన్‌ కాంబినేషన్‌లో సినిమాని రూపొందిస్తున్నట్టు చిత్ర నిర్మాణ సంస్థ సన్‌ పిక్చర్స్‌ గురువారం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేసింది. ఇందులో నెల్సన్‌, రజనీకాంత్‌, సంగీత దర్శకుడు అనిరుధ్‌ స్టైలిష్‌ లుక్‌లో కనిపించి అందరినీ ఆకట్టుకునేలా ఉన్నారు. ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. రజనీకాంత్‌ ఇటీవల ‘అన్నాత్తే’ (పెద్దన్న) చిత్రంతో ప్రేక్షకుల్ని అలరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని