నటుడిగా కాదు.. బాధితుడిగా ఇక్కడికొచ్చా: తారక్‌

యంగ్‌ టైగర్‌ నందమూరి తారక రామారావు సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీస్‌ కేంద్రానికి బుధవారం విచ్చేశారు. సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీస్ వార్షిక సమావేశంలో భాగంగా ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ ట్రాఫిక్‌ పోలీసు వారు ఏర్పాటు చేసిన

Updated : 17 Feb 2021 14:30 IST

హైదరాబాద్‌: యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీస్‌ కేంద్రానికి బుధవారం విచ్చేశారు. సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీస్ వార్షిక సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను ఆసక్తిగా పరిశీలించారు. వారు వినియోగించే రక్షణాత్మక పరికరాల గురించి అడిగి తెలుసుకున్నారు.

అనంతరం సమావేశంలో తారక్‌ మాట్లాడుతూ ‘నేను ఈ సమావేశానికి ఒక నటుడిగానే రాలేదు. ఒక పౌరునిగా, రోడ్డు ప్రమాదంలో ఇద్దరు కుటుంబసభ్యులను కోల్పోయిన బాధితుడిగా వచ్చాను. ట్రాఫిక్‌ రూల్స్‌, రోడ్డు జాగ్రత్త సూచనలు పాటించడం సర్వోత్తమమైన విషయం’ అని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో సీపీ సజ్జనార్‌తో పాటు ఇతర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని