The Gray Man: ధనుష్‌ హాలీవుడ్‌ చిత్రం.. ‘గ్రేమ్యాన్‌’ ట్రైలర్‌ వచ్చేసింది!

కోలీవుడ్‌ ప్రముఖ నటుడు ధనుష్‌ హాలీవుడ్‌ చిత్రం ‘గ్రేమ్యాన్‌’ లో నటిస్తున్నాడని తెలిసినప్పటి నుంచే అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

Updated : 29 Jun 2023 16:13 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కోలీవుడ్‌ ప్రముఖ నటుడు ధనుష్‌ (Dhanush) హాలీవుడ్‌ చిత్రం ‘ది గ్రేమ్యాన్‌’ (The Gray Man)లో నటిస్తున్నాడని తెలిసినప్పటి నుంచే అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ ఆంగ్ల సినిమాలో తమ అభిమాన నటుడు ఎలా కనిపిస్తాడోనన్న ఉత్కంఠ మొదలైంది. ఎప్పుడెప్పుడు ట్రైలర్‌ వస్తుందా? అని ఎదురుచూసిన వారికి చిత్ర బృందం సర్‌ప్రైజ్‌ చేస్తూ ట్రైలర్‌ విడుదల చేసింది. పూర్తిస్థాయి యాక్షన్‌ సన్నివేశాలతో రూపొందిన ఈ ట్రైలర్‌లో ధనుష్‌ ఓ సీన్‌లో తళుక్కున మెరిశారు. చాలా స్టైలిష్‌గా కనిపించారు. ‘కెప్టెన్‌ అమెరికా’, ‘అవెంజర్స్‌’ సిరీస్‌ తదితర చిత్రాలను అందించిన దర్శక ద్వయం రస్సో బ్రదర్స్‌ (Russo Brothers) ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ధనుష్‌తో పాటు రియాన్‌ గోస్లింగ్‌, క్రిస్‌ ఎవాన్స్‌, అనా డి అర్మాస్‌, జెస్సికా హెన్విక్‌ తదితర హాలీవుడ్‌ నటులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రం నేరుగా ఓటీటీలో విడుదలకానుంది. ‘నెట్‌ఫ్లిక్స్‌’ (Netflix)లో జులై 22 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని