telugu movies: ఈ వారం థియేటర్/ఓటీటీలో వచ్చే చిత్రాలివే!
telugu movies: ఈ వారం థియేటర్, ఓటీటీలో వస్తున్న చిత్రాలివే!
telugu movies: గత వారం బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాలు సందడి చేయగా, ఈసారి సింహం సింగిల్‌గా వస్తుందంటూ అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబు ఒక్కడే థియేటర్‌కు వస్తున్నారు. మరి ఈ వారం థియేటర్, ఓటీటీలో వచ్చే చిత్రాలు వాటి విశేషాలు చూసేద్దామా!
‘పోకిరి’ని మరిపించేలా..
‘సర్కారువారి పాట’(Sarkaru Vaari Paata) సినిమా చేస్తుంటే ‘పోకిరి’నాటి రోజులు గుర్తుకు వచ్చాయని అంటున్నారు అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబు(Mahesh babu). ఆయన కీలక పాత్రలో పరశురామ్ తెరకెక్కించిన చిత్రమిది. కీర్తి సురేశ్(Keerthy Suresh) కథానాయిక. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. యాక్షన్ ఎంటర్టైనర్గా తీర్చిదిద్దిన ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు, ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. అంతేకాదు, మహేశ్‌బాబు ఇందులో ఫుల్ ఎనర్జీతో నటించారని అర్థమవుతోంది.‘నేను విన్నాను.. నేను ఉన్నాను’, ‘100 వయాగ్రాలు వేసుకుని శోభనానికి రెడీ అయిన పెళ్లి కొడుకు గదికి వచ్చినట్లు వచ్చారు’ అంటూ డైలాగ్‌లు మహేశ్ అభిమానులతో విజిల్స్ వేయిస్తున్నాయి. బ్యాంకు రుణాలు, ఆర్థికలావాదేవీల ఇతివృత్తంగా పరశురామ్ ‘సర్కారువారి పాట’ (Sarkaru Vaari Paata)రూపొందించారు. సముద్రఖని, వెన్నెల కిషోర్, తదితరులు కీలక పాత్రలు పోషించారు.
భ్రూణహత్యల నేపథ్యంలో...
రణ్వీర్ సింగ్ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘జయేశ్‌భాయ్ జోర్దార్’(Jayeshbhai Jordaar). మే 13న విడుదల కానున్న ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రంలో రణవీర్ భార్యగా షాలినీ పాండే కనిపించనుంది. బొమన్ ఇరానీ, రత్నపాఠక్ షా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. దివ్యాంగ్ ఠక్కర్ దర్శకత్వం వహించారు. భ్రూణహత్యల నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రంలో ఆడపిల్ల తండ్రిగా రణ్‌బీర్ కనిపించనున్నాడు. యశ్‌రాజ్ ఫిల్మ్స్ పతాకంపై ఆదిత్య చోప్రా, మనీశ్ శర్మ ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఈ వారం ఓటీటీలో వస్తున్న చిత్రాలివే!
జీ5లో ‘ది కశ్మీర్ ఫైల్స్’
చిన్న సినిమాగా విడుదలై, ఊహించనంత పెద్ద విజయం అందుకుంది ‘ది కశ్మీర్ ఫైల్స్’(The kashmir files). విమర్శకుల ప్రశంసలతోపాటు వసూళ్లను రికార్డు స్థాయిలో రాబట్టింది. అలాంటి ఈ సినిమాను మళ్లీ మళ్లీ చూసేందుకు ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా? అని ఆసక్తిగా ఎదురుచూసిన అభిమానుల నిరీక్షణకు ఈ వారం తెర పడనుంది. మే 13 నుంచి ఈ సినిమా ‘జీ 5’లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో అందుబాటులో ఉంటుంది. అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, దర్శన్ కుమార్, పల్లవి జోషి తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకు వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించారు.
కమర్షియల్ ‘బీస్ట్’ ఎప్పుడంటే..
విజయ్-నెల్సన్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘బీస్ట్’(Beast). ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా మంచి వసూళ్లనే రాబట్టింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ వేదికగా మే 11న ఈ సినిమా ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. టెర్రరిజం నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ సినిమాలో విజయ్(Vijay) రా ఏజెంట్ పాత్రలో నటించారు. ఓ ప్రముఖ షాపింగ్‌మాల్‌ని టెర్రరిస్టులు హైజాక్ చేయడం.. టెర్రరిస్టుల చేతుల్లో బంధిగా ఉన్నవారిలో ఓ రా ఏజెంట్ కూడా ఉండటం.. ఇలాంటి అంశాలతో ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో విజయ్ ఫుల్ ఎనర్జిటిక్ లుక్‌లో కనిపించారు. ఆయనకు జోడీగా పూజాహెగ్డే(Pooja hegde) నటించారు. అనిరుధ్ స్వరాలు సమకూర్చారు.
ఓటీటీలో రాబోతున్న మరికొన్ని చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు
నెట్ ఫ్లిక్స్
* సేవేజ్ బ్యూటీ(వెబ్ సిరీస్) మే12
జీ5
* తాలెదండ (కన్నడ) మే 13
* ముగిలిపేట్ (కన్నడ) మే13
అమెజాన్ ప్రైమ్
* ది మాట్రిక్స్ రెసరెక్షన్స్ (తెలుగు డబ్బింగ్) మే12
* మోడర్న్ లవ్ ముంబై (హిందీ సిరీస్)మే 13
* వుషు (మలయాళం) మే13
డిస్నీ+హాట్‌స్టార్
* స్నీకరెల్లా (హాలీవుడ్ ) మే 13
ఆహా
* కుతుకు పత్తు (తమిళం) మే 13
వూట్
* ఆదా ఇష్క్(హిందీ సిరీస్) మే12
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్‌పై ప్రశాంత్ వర్మ
తన సినిమాటిక్ యూనివర్స్‌పై దర్శకుడు ప్రశాంత్‌వర్మ ఆసక్తికర కామెంట్స్ చేశారు. -
హనుమాన్ జన్మోత్సవ్.. ప్రశాంత్‌వర్మ ప్లాన్ మామూలుగా లేదుగా!
హనుమాన్ జన్మోత్సవ్ సందర్భంగా ‘జై హనుమాన్’కు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని ప్రశాంత్‌వర్మ పంచుకున్నారు. -
పెద్ద స్టార్స్ ఎవరూ ఉండరు.. ‘ది దిల్లీ ఫైల్స్’ అప్డేట్ ఇచ్చిన దర్శకుడు
‘ది దిల్లీ ఫైల్స్’లో పెద్ద స్టార్స్ ఎవరూ ఉండరని దర్శకుడు స్పష్టం చేశారు. -
10 వేల పదాలతో విజయ్‌పై కవిత.. అవార్డు దక్కించుకున్న అభిమాని
తమిళ స్టార్ హీరో విజయ్‌పై ఓ అభిమాని వినూత్న రీతిలో తన అభిమానాన్ని చాటుకున్నారు. -
రజనీకాంత్- లోకేశ్ కాంబో టైటిల్ వచ్చేసింది.. ఈ పేరు ఊహించారా?
రజనీకాంత్ కొత్త సినిమా టైటిల్ ఖరారైంది. అదేంటంటే? -
చిరు ‘విశ్వంభర’.. హైలైట్ షెడ్యూల్ పూర్తి!
చిరంజీవి హీరోగా రూపొందుతున్న ‘విశ్వంభర’లో ఇంటర్వెల్ సన్నివేశాలు హైలైట్ కానున్నాయి. దీని షెడ్యూల్‌ను పూర్తి చేసినట్లు సమాచారం. -
ఈ వారం థియేటర్లో ఆసక్తికర మూవీస్.. ఓటీటీలో డబుల్ ఫన్..
ఏప్రిల్ చివరి వారంలో ప్రేక్షకులను అలరించడానికి థియేటర్‌కు ఆసక్తికర చిత్రాలు రాబోతున్నాయి. అలాగే ఓటీటీలోనూ వినోదాన్ని పంచడానికి పలు చిత్రాలు, సిరీస్‌లు సిద్ధమయ్యాయి. -
ఆసక్తి రేకెత్తిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ గ్లింప్స్.. అమితాబ్ బచ్చన్ పాత్ర ఇదే!
‘కల్కి 2898 ఏడీ’లోని అమితాబ్ బచ్చన్ పాత్రకు సంబంధించిన గ్లింప్స్ విడుదలైంది. -
25 రోజుల్లో రూ.150 కోట్లు.. బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోన్న ‘ఆడు జీవితం’
పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) ప్రధాన పాత్రలో నటించిన సర్వైవల్ థ్రిల్లర్ ‘ఆడు జీవితం’ (Aadujeevitham). ఇటీవల విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. -
‘శబరి’ చేయడానికి ఆమె ప్రధాన కారణం: నిర్మాత మహేంద్రనాథ్
‘శబరి’ సినిమా మే 3న ప్రేక్షకుల ముందుకురానున్న సందర్భంగా నిర్మాత మీడియాతో ముచ్చటించారు. -
వాటిని నమ్మకండి.. మహేశ్-రాజమౌళి సినిమాపై నిర్మాత కామెంట్స్
రాజమౌళి - మహేశ్ ప్రాజెక్ట్‌పై సోషల్ మీడియాలో వచ్చే వార్తలను నమ్మొద్దని నిర్మాత గోపాల్‌రెడ్డి కోరారు. -
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అయిన ‘ప్రేమలు’ చిత్రానికి సీక్వెల్ రానుంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. -
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
రెండు హిట్ సినిమాల సీక్వెల్స్‌పై నిర్మాత రాధామోహన్ మాట్లాడారు. వాటి స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందన్నారు. -
సూపర్‌హిట్ చిత్రానికి సీక్వెల్ ప్రకటించిన సితార ఎంటర్టైన్మెంట్స్
ఎన్టీఆర్ బామ్మర్ది నార్నే నితిన్ తెరంగేట్రం చేసిన చిత్రం ‘మ్యాడ్’ (MAD). కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. -
తేజ సజ్జా కొత్త చిత్రం.. టైటిల్ ఏమిటంటే..?
‘హనుమాన్’తో ఘన విజయాన్ని అందుకున్నారు నటుడు తేజ సజ్జా (Teja Sajja). తాజాగా ఆయన తన కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేశారు. -
మాటిస్తున్నా..: ‘జై హనుమాన్’పై ప్రశాంత్ వర్మ పోస్ట్
ప్రశాంత్ వర్మ (Prasanth varma) - తేజ సజ్జా (Teja Sajja) కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘హనుమాన్’ (Hanuman). ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘జై హనుమాన్’ (Jai hanuman) రానున్న విషయం తెలిసిందే. -
ఐపీఎల్, ఎన్నికల ఎఫెక్ట్.. వెనక్కి తగ్గుతున్న సినిమాలు..!
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెలలో విడుదల కానుండటంతో రాజకీయ వేడి మరింత పెరగనుంది. దీంతో పలు సినిమాలు వాయిదా పడుతున్నాయి. -
చిత్ర పరిశ్రమలో ‘ఏఐ’ ట్రెండ్.. విజయ్ సినిమాలో దివంగత నటుడు!
విజయ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’. ఇందులో దివంగత నటుడు విజయకాంత్ కనిపించనున్నారు. -
మహేశ్-రాజమౌళి మూవీ.. ముందే ఆ విషయం చెప్పబోతున్నారా?
మహేశ్, రాజమౌళి సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర విషయం సామాజిక మాధ్యమాల వేదికగా చక్కర్లు కొడుతోంది. -
‘కన్నప్ప’లో బాలీవుడ్ స్టార్ హీరో.. అధికారికంగా ప్రకటించిన టీమ్..
‘కన్నప్ప’లో బాలీవుడ్ స్టార్ హీరో భాగమైనట్లు చిత్రబృందం తెలిపింది. -
ఈ వారమూ చిన్న చిత్రాలదే హవా.. మరి ఓటీటీలో..?
ఈ వారం కూడా బాక్సాఫీస్ వద్ద చిన్న చిత్రాలే సందడి చేయనున్నాయి. మరోవైపు ఓటీటీలో అలరించే చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్‌జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM