Valentine Day: వెండితెరపై ‘ప్రేమ’ సంతకం.. చెదరని జ్ఞాపకం!

అమ్మ, ఆవకాయ్‌, ప్రేమకథలు ఎప్పుడూ బోర్‌కొట్టవు. మనుసుని హత్తుకుని నిద్రపట్టనివ్వవు. అందుకే నాటి నుంచి నేటి వరకు.. ఓ ఏడాదిలో విడుదలయ్యే సినిమాల్లో 80 శాతం లవ్‌స్టోరీలే ఉంటున్నాయి.

Updated : 13 Sep 2022 16:52 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అమ్మ, ఆవకాయ్‌, ప్రేమకథలు ఎప్పుడూ బోర్‌కొట్టవు. మనుసుని హత్తుకుని నిద్రపట్టనివ్వవు. అందుకే నాటి నుంచి నేటి వరకు.. ఓ ఏడాదిలో విడుదలయ్యే సినిమాల్లో 80 శాతం లవ్‌స్టోరీలే ఉంటున్నాయి. ప్రేమికుల రోజు సందర్భంగా వెండితెరపై వెలిగిన ప్రేమ సినిమా టైటిళ్లు, పాటలు, సంభాషణల్ని గుర్తు చేసుకుందామా...!

తమ ప్రేమను వ్యక్తం చేసేందుకు చాలామంది ప్రేమికులకు కేరాఫ్‌ అడ్రస్‌ సినిమానే. ప్రేమకు సంబంధించిన సినిమా పేర్లతోనో, పాటలతోనో, మాటలతోనో ప్రపోజ్‌ చేస్తుంటారు. ఒకవేళ తాను ప్రేమిస్తున్న వ్యక్తి నుంచి సానుకూల స్పందన రాకపోతే ‘సినిమా’టిక్‌గా చెప్పానంటుంటారు. పెళ్లైన తర్వాత ఆ మధుర జ్ఞాపకాల్ని తలచుకుని మురిసిపోతుంటారు. మరి ఇలాంటి మెమొరీస్‌ని పంచిన సినిమాల్ని వాలంటైన్స్‌డేకి గుర్తుచేసుకోకపోతే ఎలా? 

పేరులోనూ ప్రేమే..

కథలో ఎంత ప్రేమున్నా ఆయా చిత్రాలకు ‘ప్రేమ’ అని వచ్చేలా నామకరణం చేయటం అన్ని వేళలా సాధ్యమవదు. అప్పుడప్పుడు మాత్రమే ఇలాంటి టైటిళ్లు వస్తుంటాయి. ప్రేమికుల మదిలో చిరస్థాయిగా నిలుస్తాయి. అలా కథే కాకుండా పేరులోనూ ‘ప్రేమ’ను నింపుకున్న కొన్ని సినిమాలివీ.. ‘ప్రేమ’, ‘ప్రేమికులరోజు’, ‘ప్రేమదేశం’, ‘ప్రేమంటే ఇదేరా’, ‘ప్రేమతో రా’, ‘ప్రేమించుకుందాం రా’, ‘ప్రేమలో పావని కల్యాణ్‌’, ‘తొలి ప్రేమ’, ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా?’, ‘ప్రేమకావాలి’, ‘ప్రేమకు వేళాయెరా’, ‘ప్రేమకు స్వాగతం’, ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’, ‘ప్రేమకథా చిత్రమ్‌’, ‘హలో గురు ప్రేమకోసమే’, ‘ప్రేమ ఇష్క్‌ కాదల్‌’, ‘ప్రేమ పిపాసి’, ‘ప్రేమికుడు’, ‘అమరం అఖిలం ప్రేమ’, ‘ప్రేమ.. జిందాబాద్‌’, ‘హలో ప్రేమిస్తారా!’, ‘ప్రేమ పావురాలు’, ‘లవ్‌స్టోరి’, ‘ఇది నా లవ్‌స్టోరి’.

ప్రేమను తెలియజేసేలా..

ప్రేమకథే అయినా కొన్ని సినిమాల పేర్లు.. హీరో, హీరోయిన్‌ ఒకరికొరకు తమ ప్రేమను తెలియజేసేలా ఉంటాయి. వాటిలో కొన్ని.. ‘నువ్వు నాకు నచ్చావ్‌’, ‘నా మనసంతా నువ్వే’, ‘నిన్నే ఇష్టపడ్డాను’, ‘నీ మనసు నాకు తెలుసు’, ‘నువ్వులేక నేను లేను’, ‘నువ్వే కావాలి’, ‘143’, ‘తేజ్‌.. ఐ లవ్‌ యు’, ‘ఐ లవ్‌ యు బంగారం’, ‘నువ్వు నేను’, ‘నువ్వు నేను ప్రేమ’, ‘నువ్వొస్తావని’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ‘ప్రియమైన నీకు’, ‘కలుసుకోవాలని’, ‘నీ స్నేహం’, ‘నీకు నేను నాకు నువ్వు’. ప్రేమ పాటలు, మాటల గురించి చెప్పటం కంటే వింటేనే బాగుంటుంది. ఆలస్యమెందుకు కింది వీడియోల్లో వినేయండి...
















Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని