Published : 19 May 2022 13:15 IST

RRR: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’.. పవర్‌ఫుల్‌ షాట్స్‌ ఇలా క్రియేట్‌ చేశారు

వీడియో రిలీజ్‌ చేసిన చిత్ర నిర్మాణ సంస్థ

హైదరాబాద్‌: రామ్‌చరణ్‌-తారక్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన విజువల్‌ వండర్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి బిగ్గెస్ట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రికార్డ్స్‌ క్రియేట్‌ చేసింది. భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకున్న ఈ సినిమాలో వీఎఫ్‌ఎక్స్‌ వర్క్స్‌కి పెద్ద పీట వేసిన సంగతి తెలిసిందే. పులితో ఎన్టీఆర్‌ చేసే పోరాటం, ఓ సన్నివేశంలో రామ్‌చరణ్‌-పులి ఫైట్‌, చరణ్‌పై పాము దాడి చేయడం.. ఇలాంటి ఎన్నో షాట్స్‌కి వీఎఫ్‌ఎక్స్‌ ఉపయోగించారు. అయితే, ఆయా సన్నివేశాల్లో AlzahraVFX సంస్థ విజువల్ ఎఫెక్ట్స్‌ ఎలా క్రియేట్‌ చేసిందో తెలియజేస్తూ తాజాగా చిత్ర నిర్మాణ సంస్థ ఓ స్పెషల్‌ వీడియో రిలీజ్‌ చేసింది. పులి, పాముని సృష్టించడానికి సదరు సంస్థ 18 వీఎఫ్‌ఎక్స్‌ షాట్స్‌ని క్రియేట్‌ చేసిందని పేర్కొంది. ఈ వీడియో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. రామ్‌చరణ్‌, తారక్‌ తొలిసారి ఈ సినిమా కోసం కలిసి స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నారు. రామ్‌చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా, తారక్‌ కొమురంభీమ్‌గా నటించారు. చరణ్‌ జోడీగా ఆలియా, తారక్‌కు జంటగా ఒలీవియా మోరీస్‌ కీలకపాత్రలు పోషించారు.



Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని